నోరు జారి పొరపాటున పాకిస్థాన్ జాతిపిత మహ్మద్ అలీ జిన్నా పేరును వాడానని కాంగ్రెస్ నేత శతృఘ్న సిన్హా స్పష్టం చేశారు. ఛింద్వాడా బహిరంగ సభలో ప్రసంగిస్తూ... కాంగ్రెస్లో ప్రముఖుల పేర్లను సిన్హా ప్రస్తావించటం వివాదాస్పదమయింది.
"కాంగ్రెస్.. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, అలీ జిన్నా, నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులున్న పార్టీ. స్వాతంత్రోద్యమం నుంచి దేశాభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకం. నేను కాంగ్రెస్లో చేరింది అందుకే. ఇక ఒకసారి వచ్చానంటే పార్టీని వీడటం అంటూ జరగదు."
-శతృఘ్న సిన్హా, కాంగ్రెస్ నేత
విమర్శల వెల్లువ
సిన్హా వ్యాఖ్యలపై ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెట్టారు. దేశాన్ని విభజించిన వ్యక్తిని కాంగ్రెస్ కీర్తిస్తోందని ఆరోపించారు భాజపా అధ్యక్షుడు అమిత్ షా.