తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ, షాపై సుప్రీంలో కాంగ్రెస్ మరో వ్యాజ్యం - supreme

ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. వీరిద్దరిపై ఎన్నికల సంఘానికి 11 ఫిర్యాదులు అందితే కేవలం 5 ఫిర్యాదులపైనే ఈసీ నిర్ణయం తీసుకుందని  కాంగ్రెస్‌ ఎంపీ సుస్మితాదేవ్‌ మరో పిటిషన్‌ దాఖలు చేశారు.

మోదీ,షా పై సుప్రీంలో కాంగ్రెస్ మరో వ్యాజ్యం

By

Published : May 7, 2019, 9:53 PM IST

Updated : May 8, 2019, 12:05 AM IST

మోదీ, షాపై సుప్రీంలో కాంగ్రెస్ మరో వ్యాజ్యం

ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్‌షా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారంటూ సుప్రీంకోర్టులో మరోసారి పిటిషన్​ దాఖలు చేసింది కాంగ్రెస్​ పార్టీ. మోదీ, షాపై ఎన్నికల సంఘానికి 11 ఫిర్యాదులు అందితే కేవలం 5 ఫిర్యాదులపైనే ఈసీ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్‌ఎంపీ సుస్మితాదేవ్‌ ఈ పిటిషన్‌ వేశారు.

ఎలాంటి కారణాలు చూపించకుండా మోదీకి క్లీన్‌చిట్ ఇచ్చారని సుస్మితాదేవ్‌ పిటిషన్​లో పేర్కొన్నారు. 6 ఫిర్యాదుల్లో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీపై ప్రధాన మంత్రి మోదీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు కాంగ్రెస్ చేసిన ఫిర్యాదుపై ఈసీ చర్యలు తీసుకోలేదని ప్రస్తావించారు.

మోదీ, అమిత్ షాపై చర్యలు తీసుకోవడంలో ఈసీ విఫలమైందని సుస్మితా దేవ్‌ ఆరోపించారు. మోదీ, అమిత్‌షా కోడ్ ఉల్లంఘన పిటిషన్ రేపు విచారణకు రానుంది.

ఇదీ చూడండి: ప్రకృతి కోసం మోదీతో ఒబామా దోస్తానా..!

Last Updated : May 8, 2019, 12:05 AM IST

ABOUT THE AUTHOR

...view details