తెలంగాణ

telangana

ETV Bharat / bharat

100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్ - మోదీ

మోదీ సర్కార్ 100 రోజుల​ పాలనపై కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ సునిశిత విమర్శలు చేశారు. కనీసం అభివృద్ధి ఊసే లేకుండా విజయవంతంగా పాలన చేస్తున్నారంటూ ట్విట్టర్ వేదికగా చురకలంటించారు.

100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్

By

Published : Sep 8, 2019, 3:40 PM IST

Updated : Sep 29, 2019, 9:35 PM IST

'అభివృద్ధి ఛాయ లేకుండా 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న మోదీ సర్కార్​కు అభినందనలు' అంటూ కాంగ్రెస్​ నేత రాహుల్​గాంధీ విమర్శించారు.

భాజపా సర్కార్​కు సరైన నాయకత్వం, ఓ దశాదిశా లేవని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమనాన్ని నియంత్రించే కనీస ప్రణాళికలు కూడా మోదీ సర్కార్​ వద్ద లేవని ఆరోపించారు.

"మోదీ సర్కార్​కు అభినందనలు. ప్రజాస్వామ్యాన్ని నిరంతరం అణిచివేస్తూ, విమర్శించే మీడియా గొంతునొక్కేస్తున్నారు. పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థను సరిదిద్దే నాయకత్వం, దశ, ప్రణాళికులు లేని మీకు శుభాకాంక్షలు"
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్ నేత

100రోజుల పాలనపై మోదీకి రాహుల్​ శుభాకాంక్షల పంచ్

ఇదీ చూడండి: అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా


Last Updated : Sep 29, 2019, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details