సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవంపై చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దిల్లీలో భేటీ అయింది. ఓటమికి కారణాలు విశ్లేషించి.. తదుపరి కార్యచరణపై దృష్టి పెట్టేందుకు సమావేశం ఏర్పాటుచేసింది. పరాజయంతో కుంగిపోకుండా.. శ్రేణుల్లో స్థైర్యం నింపే ప్రయత్నం చేశారు నేతలు. పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమావేశానికి నేతృత్వం వహించారు. యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాలైన పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, ఇతర సీనియర్ నేతలు హాజరయ్యారు.
ముఖ్యంగా లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణాలను విశ్లేషించారు. ప్రజలకు ఎందుకు చేరువకాలేదనే అంశంపై కమిటీ సుదీర్ఘంగా చర్చించింది. కాంగ్రెస్ ఓటమిపై నేతలు తమ తమ అభిప్రాయాలు వెల్లడించారు.
రాహుల్ రాజీనామా వార్త అవాస్తవం...?