తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదరికంపై కాంగ్రెస్ 'మెరుపుదాడి': రాహుల్​ - కాంగ్రెస్​

దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్ పార్టీ పేదరికంపై మెరుపుదాడి(సర్జికల్ స్ట్రయిక్)​కి పూనుకుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ అన్నారు. ప్రధాని మోదీ ధనికులకు మాత్రమే కాపలాదారు అని విమర్శించారు.

పేదరికంపై కాంగ్రెస్ 'సర్జికల్ స్ట్రయిక్': రాహుల్​

By

Published : Mar 26, 2019, 5:13 PM IST

దేశంలో పేదరికాన్ని నిర్మూలించేందుకు కాంగ్రెస్ కంకణం కట్టుకుందని రాహుల్​ గాంధీ అన్నారు. మోదీ ధనికులకు నగదు సమకూరిస్తే తాము దేశంలోని పేదలకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు.

పేదరికాన్ని నామ రూపాల్లేకుండా చేసేందుకు చరిత్రలో ఏ దేశం చేయని కార్యక్రమాన్ని తాము చేసి చూపిస్తామన్నారు రాహుల్​ గాంధీ. పేదల రహిత దేశంగా భారత్​ను తీర్చిదిద్దుతామని శపథం చేశారు.

యూపీఏ హయాంలో దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న 14 కోట్ల మందికి చేయూతనిచ్చామని రాహుల్ తెలిపారు. దేశంలో ఇంకా 25 కోట్ల మంది పేదలుండటం విచారించాల్సిన విషయమన్నారు.

రాజస్థాన్​ సురత్​గఢ్​​​లో కాంగ్రెస్ బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. దేశంలోని 20 శాతం పేదలకు కనీస ఆదాయ పథకాన్ని ప్రకటించారు రాహుల్​.

బహిరంగ సభలో ప్రసంగిస్తున్న రాహుల్

"ఐదేళ్లుగా నరేంద్ర మోదీ దేశాన్ని రెండుగా విభజించాలనుకుంటున్నారు. ఒకటి ధనికులు, ప్రయివేటు సంస్థల యజమానులు, అనిల్ అంబానీ లాంటి వారికోసం. రెండోది రైతులు, చిరువ్యాపారులు, నిరుద్యోగులు, కార్మికులు వంటి పేదల కోసం. మోదీ పాలనలో ధనికులు మాత్రమే వారి కలలను సాకారం చేసుకుంటున్నారు. రైతులు, పేదలు వారి పిల్లల స్కూలు ఫీజులకు రూ.లక్షలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోదీ తాను కాపలాదారు అని చెబుతారు. కానీ ఎవరికి కాపాలదారో మాత్రం చెప్పరు. రైతుల ఇళ్లలో కాపలాదార్లు ఉంటారా? నిరుద్యోగ యువత ఇళ్లలో కాపలాదార్లు ఉంటారా.. అనిల్​ అంబానీ ఇంట్లో ఎంత మంది కాపలాదారులుంటారు. లైన్లో నిలబడేంత మంది ఉంటారు. తాను ప్రజలకు కాదు అనిల్ అంబానీ, నీరవ్​ మోదీ వంటి ధనికులకు కాపలాదారు అని మోదీ ఎప్పుడూ మీకు చెప్పలేదు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ఇదీ చూడండి:కాంగ్రెస్​కు "మరో చరిత్ర" సాధ్యమేనా..?

ABOUT THE AUTHOR

...view details