తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'విద్యా రుణాలకు మోకాలడ్డుతోన్న కేంద్రం' - విద్యా రుణాలు

విద్యా రుణాల మంజూరుకు కేంద్రం విధించిన నూతన నిబంధనలను కాంగ్రెస్ విమర్శించింది. రుణాల మంజూరుకు నూతనంగా ప్రవేశపెట్టిన అర్హత నిబంధనలతో లక్షలమంది ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులు వృత్తి, సాంకేతిక విద్యకు దూరమవుతున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ఆరోపించారు.

'విద్యా రుణాలకు మోకాలడ్డుతోన్న కేంద్రం'

By

Published : Jul 1, 2019, 5:39 PM IST

Updated : Jul 1, 2019, 11:46 PM IST

'విద్యా రుణాలకు మోకాలడ్డుతోన్న కేంద్రం'

ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ఇచ్చే విద్యా రుణాల మంజూరుకు కేంద్రం నూతన నిబంధనలపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. రుణ అర్హత నిబంధనలు లక్షలమంది విద్యార్థులను వృత్తి, సాంకేతిక విద్యకు దూరం చేసేలా ఉన్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా ట్విట్టర్​లో పోస్ట్ చేశారు. నూతన నిబంధనల ప్రకారం కేవలం కొన్ని విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులు మాత్రమే విద్యా రుణాలను పొందేందుకు అర్హులవుతారన్న ఓ వార్తా కథనాన్ని ఉటంకిస్తూ విమర్శలు చేశారు సుర్జేవాలా.

కేంద్ర మానవ వనరుల శాఖ నూతన మార్గదర్శకాల ప్రకారం కేవలం నాక్ అక్రిడిటేషన్ పొందిన విద్యా సంస్థలు లేదా కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా నడిచే విద్యా సంస్థల్లోని విద్యార్థులు మాత్రమే రుణాలకు అర్హులు.

సుర్జేవాలా ట్వీట్

"ఆర్థికంగా వెనకబడిన వృత్తి విద్యా, సాంకేతిక విద్య అభ్యసించే లక్షలమంది విద్యార్థులను రుణ మంజూరు అర్హత నిబంధన పేరుతో కేంద్రం శిక్షిస్తోంది. విద్యా రుణాలు కేవలం 1056 విద్యా సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి."

-రణ్​దీప్ సుర్జేవాలా ట్వీట్

ఈ నూతన నిబంధనలతో భాజపా ప్రభుత్వం విద్యా రుణాల పథకాన్ని నీరుగార్చిందని, వృత్తి విద్యా, సాంకేతిక విద్యలకు నూతన నిబంధనలు మేలు చేసేవి కాదని తన ట్వీట్​లో సుర్జేవాలా ఆరోపించారు.

సుర్జేవాలా ట్వీట్

అవగాహన లేమితో కొంతమంది మాత్రమే విద్యారుణాలకు దరఖాస్తు చేస్తున్నారని సుర్జేవాలా వెల్లడించారు. గత నాలుగేళ్లలో ప్రభుత్వం వద్దకు వచ్చిన 1.44 లక్షల దరఖాస్తుల్లో 42,700కు మాత్రమే రుణాల మంజూరుకు బ్యాంకులు అంగీకరించాయని తెలిపారు.

ఇదీ చూడండి: 'స్వేచ్ఛ' కోసం హాంగ్​కాంగ్ వాసుల పోరుబాట

Last Updated : Jul 1, 2019, 11:46 PM IST

ABOUT THE AUTHOR

...view details