తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిఘావర్గాల వైఫల్యం వల్లే జవాన్ల మృతి' - నిఘా

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడుల్లో జవాన్ల మరణాలపై కాంగ్రెస్ విచారం వ్యక్తం చేసింది. కశ్మీర్​లో ప్రస్తుత పరిస్థితికి నిఘావర్గాల వైఫల్యమే కారణమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా ఆరోపించారు. కేంద్రం సమాధానం చెప్పాలని ట్విట్టర్​లో డిమాండ్​ చేశారు.

'నిఘావర్గాల వైఫల్యమే జవాన్ల మృతికి కారణం'

By

Published : Jun 19, 2019, 6:56 PM IST

నిఘావర్గాల వైఫల్యం కారణంగానే జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాద దాడుల్లో జవాన్లు బలవుతున్నారని కాంగ్రెస్​ ఆరోపించింది. వీరి మృతిపై కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్​దీప్ సుర్జేవాలా. ఈ విషయంపై వరుస ట్వీట్లు చేశారు.

"గడిచిన 24 గంటల్లో నలుగురు జవాన్లు మృతిచెందారు. గత వారం రోజుల్లో కశ్మీర్​లో 10 మంది జవాన్లు మరణించారు. మాతృభూమి కోసం వారు చేసిన త్యాగాలకు సెల్యూట్​ చేస్తున్నా. ఇది అతిపెద్ద నిఘా వైఫల్యం. మన భద్రతా దళాలపై పూర్తి విశ్వాసం ఉంది. "

-రణ్​దీప్​ సుర్జేవాలా ట్వీట్​.

ఇదీ చూడండి: రోబో పోలీసు వచ్చేశాడు.. పారా హుషార్​!

ABOUT THE AUTHOR

...view details