తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుటుంబవాదమే కాంగ్రెస్​కు జాతీయవాదం: మోదీ

జాతీయవాదం విషయంలో కాంగ్రెస్​పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ప్రధాని నరేంద్రమోదీ. కుటుంబవాదంలోనే కాంగ్రెస్ జాతీయవాదాన్ని చూస్తోందని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ విమర్శలు చేశారు మోదీ.

కుటుంబవాదమే కాంగ్రెస్​కు జాతీయవాదం

By

Published : Oct 16, 2019, 5:56 PM IST

కుటుంబవాదమే కాంగ్రెస్​కు జాతీయవాదం

కాంగ్రెస్​పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ప్రధాని నరేంద్రమోదీ. వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండా కాంగ్రెస్​లో ఒకప్పటి దేశభక్తులు లేరని విమర్శించారు. అలాంటివారికి ప్రస్తుతం జాతీయవాద పాఠాలు నేర్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జల్నా జిల్లా పార్తుర్ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

"కాంగ్రెస్​ పార్టీలో ఇప్పుడు కొత్త శిక్షణ ప్రారంభిస్తున్నారు. ఆ పార్టీలో జాతీయవాద పాఠాలు నేర్పిస్తున్నారు. ఏడవాలో నవ్వాలో నాకు అర్థం కావటం లేదు. దీనికి అర్థం ఏంటంటే.. స్వాతంత్ర్యోద్యమం నాటి దేశభక్తుల పార్టీ ప్రస్తుతం లేదని కాంగ్రెస్​ ఒప్పుకున్నట్లే. కుటుంబవాద రాజకీయాల్లోనే కాంగ్రెస్​కు జాతీయవాదం కనిపిస్తోంది. అందుకే ఆ పార్టీ తడబడుతోంది. అంతిమశ్వాస తీసుకుంటోంది."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

మహారాష్ట్రలో దేశభక్తి, జాతీయవాదం ఎక్కువని... అయితే కాంగ్రెస్​, ఎన్సీపీ నేతలు ఆ విలువలను మరిచిపోయారని విమర్శించారు మోదీ. ఆర్టికల్​ 370 రద్దును ఆయా పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు.

ఇదీ చూడండి: 'కశ్మీర్​లో శాంతి కోసమే ఆర్టికల్ 370 రద్దు'

ABOUT THE AUTHOR

...view details