యూపీఏ పదేళ్లపాలనలో నిస్సహాయ ప్రభుత్వం అధికారంలో ఉందని ఆరోపించారు కేంద్రమంత్రి ప్రతాప్ చంద్ర సారంగి. దేశానికి దృఢమైన నాయకత్వం ఎంత అవసరమో ఆ సమయంలో అనుకోకుండా ప్రధాని అయిన వ్యక్తి పాలన ద్వారా ప్రజలకు తెలిసిందని వ్యాఖ్యానించారు.
పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టేందుకు చర్చ నిర్వహించారు. సారంగి మాట్లాడుతూ కాంగ్రెస్ పదేళ్ల పాలనపై ధ్వజమెత్తారు. ఆ సమయంలో ఓ వ్యక్తి అనుకోకుండా ప్రధాని అయ్యారని మన్మోహన్ సింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలన అవినీతిమయమని ఆరోపించారు.