తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదల కులమే నా కులం: మోదీ - UP

దేశంలోని పేదలది ఏ కులమో తనదీ అదే కులమని వ్యాఖ్యానించారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మోదీ వెనుకబడిన తరగతులకు చెందిన వారు కాదని మాయావతి చేసిన విమర్శలకు బదులిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్ గాజీపుర్​లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. కాంగ్రెస్​, మహాకూటమి పార్టీలు పేదలు, మహిళలకు అన్యాయం చేశాయని ఆరోపించారు.

పేదల కులమే నా కులం: మోదీ

By

Published : May 11, 2019, 10:28 PM IST

కాంగ్రెస్, మహాకూటమి పార్టీలపై ధ్వజమెత్తారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. పేదలు, మహిళలను ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే వినియోగించుకున్నారు తప్ప వారికోసం చేసిందేమీ లేదని ఆరోపించారు. ఉత్తర్​ప్రదేశ్​ గాజీపుర్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు మోదీ. కాంగ్రెస్, మహాకూటమిపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్​లో ఎస్సీ మహిళపై జరిగిన అత్యాచార ఘటనను కాంగ్రెస్​ రాజకీయ లబ్ధి కోసం బయటికి రాకుండా చూస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.

సభలో మాట్లాడుతున్న మోదీ

" నా కులమేంటని వాళ్లు సర్టిఫికెట్ అడుగుతున్నారు. వారికి నా సమాధానం... నాది ఒకటే కులం. పేదలది ఏ కులమే నాదీ అదే కులం. రాజస్థాన్​లో ఒక ఎస్సీ మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పట్టుకోవాల్సింది పోయి అధికార కాంగ్రెస్​ ప్రభుత్వం, పోలీసులు కేసును దాచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వేళ ఈ విషయం బయటికి పొక్కితే వాళ్ల ఓటు బ్యాంకుపై ప్రభావం పడుతుందని వాళ్లు ఇలా చేస్తున్నారు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

ఇదీ చూడండి: 'సార్వత్రికం' ఆరో దశకు రంగం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details