'సార్వత్రికం'లో కాంగ్రెస్ ఖర్చు రూ.820 కోట్లు సార్వత్రిక ఎన్నికల సమయంలో జమా-ఖర్చుల వివరాలను ఎన్నికల సంఘానికి సమర్పించింది కాంగ్రెస్. 2019 లోక్‌సభ, 5 రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికల్లో నిధులు, ఖర్చులకు సంబంధించి ఆ పార్టీ కోశాధికారి అహ్మద్ పటేల్ లిఖిత పూర్వక నివేదిక ఇచ్చారు.
మొత్తం రూ.856 కోట్లు..
సార్వత్రిక ఎన్నికల సమయంలో రూ.856 కోట్లు పార్టీకి నిధుల రూపంలో వచ్చాయని తెలిపారు. అందులో రూ.820 కోట్ల ప్రచారం కోసం ఖర్చు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ వ్యయంలో పార్టీ ప్రచార కార్యక్రమాలకు రూ.626.36 కోట్లు, అభ్యర్థులపై 194 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు.
లోక్‌సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తరువాత.... పార్టీ వద్ద రూ. 315.88 కోట్లు ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీ.... బ్యాంకు ఖాతాల్లో రూ.265 కోట్లు, నగదు రూపంలో రూ.50 కోట్ల ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది హస్తం పార్టీ.