తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పూరీలో ఆధ్యాత్మిక శోభ- కనులపండువగా రథయాత్ర

The apex court has imposed some guidelines and restrictions in its final order. It has asked the government to ensure that the airport, railway stations, and bus stands are closed during Rath Yatra, and curfew is imposed in Puri city during the time when the Rath Yatra chariots are taken in procession.

puri
పూరీ జగన్నాథ ఆలయం

By

Published : Jun 23, 2020, 4:01 AM IST

Updated : Jun 23, 2020, 11:08 AM IST

11:05 June 23

ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో భక్తులు లేకుండానే రథయాత్ర కార్యక్రమాన్ని సంప్రదాయం ప్రకారం అర్చకులు, ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. 

  1. ఉదయం 3 గంటలకు మంగళహారతితో రథయాత్ర కార్యక్రమం ప్రారంభమైంది. 
  2. అనంతరం మైలమ, తడపలాగి సేవలు నిర్వహించారు. 
  3. నాలుగున్నర గంటలకు అబకాష, ఉదయం అయిదున్నర గంటలకు సకల ధూప కార్యక్రమాన్ని చేపట్టారు. 
  4. 6 గంటల 45 నిమిషాలకు రథ ప్రతిష్ట చేశారు. 
  5. ఆ తర్వాత పహండి, మదన్‌ మోహన్‌ బిజే, చిత్త లాగి కార్యక్రమాలు నిర్వహించారు.
  6. ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన చేరా పన్హారా కార్యక్రమం 11 గంటల 30 నిమిషాలకు నిర్వహిస్తారు.
  7. మధ్యాహ్నం 12.30కు రథయాత్ర ప్రారంభం అవుతుంది.

09:28 June 23

జగన్నాథుడి విగ్రహం...

రథయాత్ర కోసం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన జగన్నాథుడి విగ్రహాన్ని పురోహితులు రథం వద్దకు తీసుకువచ్చారు.

09:20 June 23

ప్రధాని శుభాకాంక్షలు...

పూరీ జగన్నాథుడి రథయాత్ర సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశ ప్రజల జీవితాల్లో సుఖశాంతులు, ఆనందం, ఆరోగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

08:40 June 23

బలభద్ర..

రథయాత్ర ప్రారంభించేందుకు బలభద్ర విగ్రహాన్ని పూజారులు, సేవాయత్​లు రథం వద్దకు తీసుకువచ్చారు.

08:38 June 23

రథయాత్ర కార్యక్రమం కోసం పురోహితులు ఆ జగన్నాథుడి రథం వద్దకు చేరుకున్నారు. సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం ఒక్కో రథం లాగడానికి 500 మంది కన్నా ఎక్కువ ఉండకూడదు. 

07:39 June 23

ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సన్నద్ధమైంది. భక్తులు లేకుండా.. ఆరోగ్య అంశాలపై రాజీ పడకుండా... రథయాత్ర నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్వాహకులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. రథయాత్ర సందర్భంగా తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన మూడు రథాలపై సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రల సమేతంగా బ్రహ్మాండ నాయకుడు ఊరేగనున్నాడు. ఒక్కో రథాన్ని లాగేందుకు 500 మంది అవసరమవుతారని.. మొత్తం 3 రథాలను లాగేందుకు 15 వందల మందిని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. రథాలు లాగే వారందరికీ తప్పనిసరిగా కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఒడిశా ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టింది. రథాలను లాగే సమయంలో కూడా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని.. భక్తులు రాకుండా ముందు జాగ్రత్త చర్యగా పూరీకి రవాణ సౌకర్యాన్ని నిషేధించామని అధికారులు తెలిపారు.

06:31 June 23

 ప్రారంభం...

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర ఉత్సవం ప్రారంభమైంది. తెల్లవారుజామునుంచే పూజా కార్యక్రమాలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు పురోహితులు.

04:02 June 23

పూరీ రథ యాత్ర షెడ్యూల్​ ఇదే..

ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రకు సుప్రీం పచ్చజెండా ఊపిన నేపథ్యంలో షెడ్యూల్​ను విడుదల చేసింది ఆలయ నిర్వాహక కమిటీ. తెల్లవారుజామున 3 గంటలకే పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పింది.

మంగళ హారతితో షురూ..

  • తెల్లవారుజాము 3 గంటలకు 'మంగళ హారతి' నిర్వహిస్తారు. అనంతరం 'మైలమ', 'తడప లాగి' సేవలు చేస్తారు.
  • 4.30 గంటలకు 'అబకాష', ఉదయం 5.30 నుంచి 6.45 వరకు 'సకల దూప' కార్యక్రమం.
  • 6.45కు రథప్రతిష్ఠ.
  • ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు 'పహండి' కార్యక్రమం ఉంటుంది.
  • 'మదన్​ మోహన్ బిజె' ఉదయం 10 నుంచి 10.30 వరకు నిర్వహిస్తారు.
  • ఉదయం 10.30-11.00.. 'చిత్త లాగి'.
  • ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన 'చేరా పన్హారా' కార్యక్రమం 11.30 నుంచి 12.15 వరకు జరుగుతుంది.
  • 11.45 నుంచి 12.30 వరకు సేవకులు రథాలను సిద్ధం చేస్తారు. అనంతరం మూడు రథాలతో ఊరేగింపు ప్రారంభమవుతుంది.

03:28 June 23

కదలనున్న రథచక్రాలు

కరోనా వ్యాప్తి కారణంగా పెద్దసంఖ్యలో గుమిగూడటంపై ఆంక్షలు ఉన్న నేపథ్యంలో పూరీ జగన్నాథ రథయాత్ర నిర్వహణపై కీలక తీర్పును ప్రకటించింది సుప్రీంకోర్టు. నేడు (జూన్​ 23న) ప్రారంభం కానున్న ఈ యాత్రను  భక్తులు లేకుండా జరుపుకునేందుకు అనుమతినిచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆలయ ధర్మకర్తలు సుప్రీం మార్గదర్శకాలన్నీ తప్పక పాటించాలని సూచించింది. ఈనేపథ్యంలో ఈ ఏడాది భక్తులు లేకుండానే జగన్నాథుడి రథచక్రాలు మరి కొద్ది గంటల్లో కదలనున్నాయి. 

ప్రజారోగ్యంపై రాజీ లేదు..

కరోనా వేళ ప్రజల ఆరోగ్యంపై రాజీపడేది లేదని స్పష్టం చేసింది సుప్రీం. అయితే పూరీలో మాత్రమే రథయాత్రకు అనుమతిస్తున్నామని.. మిగతా ప్రాంతాల్లో యాత్ర నిర్వహించకూడదని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో సుప్రీం మార్గదర్శకాలకు అనుగుణంగా రథయాత్రను నిర్వహిస్తామని ఒడిశా ప్రభుత్వం.. న్యాయస్థానానికి నివేదించింది.

ఏర్పాట్లపై సీఎం నవీన్ సమీక్ష..

సుప్రీం తీర్పు నేపథ్యంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పూరీ రథయాత్ర ఏర్పాట్లపై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అధికారులు, ఆలయ ధర్మకర్తలు ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.

Last Updated : Jun 23, 2020, 11:08 AM IST

ABOUT THE AUTHOR

...view details