చంద్రయాన్-2 విజయవంతం కావటం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ విజయానికి పార్టీ గత నాయకత్వమే కారణమని చెప్పేందుకు ప్రయత్నించింది. అంతరిక్ష పరిశోధనలకు భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎంతో కృషి చేశారని తెలిపింది.
"చంద్రయాన్-2ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందానికి అభినందనలు. భారత తొలి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ చేసిన సేవలను గుర్తుతెచ్చుకునేందుకు ఇది మంచి సమయం. ఆయన ఇంకోస్పార్(ఇప్పుడు ఇస్రో)ను 1962లో నెలకొల్పి నిధులు కేటాయించారు. ఆ తర్వాత చంద్రయాన్ ప్రాజెక్టుకు 2008లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పచ్చజెండా ఊపారు."
-కాంగ్రెస్ పార్టీని
తప్పుబట్టిన భాజపా
కాంగ్రెస్ ప్రకటనపై భాజపా మండిపడింది. శాస్త్రవేత్తల విజయానికి కాంగ్రెస్ రాజకీయ రంగు పులుముతోందని ఆరోపించారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర.
"కాంగ్రెస్ చేసిన ప్రకటన తప్పుదారి పట్టించేందుకే. ప్రతి భారతీయుడికి గర్వపడే విజయమిది. దీనికి రాజకీయ రంగు పులమటం సరికాదు. భావి నాయకత్వం లేనప్పుడు గత నాయకులను గుర్తు చేసుకోక మరేం చేస్తారు?"