దిల్లీకి వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం సత్వరం జోక్యం చేసుకుని ఓ ఉమ్మడి ప్రణాళిక తయారు చేయాలని.. దిల్లీ, హరియాణా, పంజాబ్‌ల ముఖ్యమంత్రులు అరవింద్ కేజ్రీవాల్, కెప్టెన్ అమరీందర్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు.
జావడేకర్ వ్యాఖ్యలపై దుమారం...
వాయునాణ్యత అంశంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జావడేకర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. పెచ్చుమీరుతున్న కాలుష్యాన్ని నియంత్రించడం కోసం ఏర్పాటు చేసిన సమావేశాల్ని కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్ వాయిదా వేశారని ఆయన ఆరోపించారు. సమస్యను పరిష్కరించేందుకు మంత్రికి సమయం లేదని.. దేశ రాజధానిలో వాయు నాణ్యత క్షీణిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు.