తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య నుంచి గోప్యత వరకు... చారిత్రక తీర్పుల్లో జస్టిస్​ బోబ్డే ముద్ర

జస్టిస్​ శరద్​ అరవింద్​ బోబ్డే... 47వ భారత ప్రధాన న్యాయమూర్తి. దశాబ్దాలుగా నలిగిన అయోధ్య సహా ఎన్నో కీలక కేసుల్లో తీర్పు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులు. న్యాయవాదిగా ఎన్నో విజయాలు సాధించి.. న్యాయమూర్తిగా మరెన్నో  కీలక తీర్పులు ఇచ్చిన వ్యక్తి. ఆయన జీవితంలోని ముఖ్య విషయాలు.

అయోధ్య నుంచి గోప్యత వరకు... చారిత్రక తీర్పుల్లో జస్టిస్​ బోబ్డే ముద్ర

By

Published : Nov 18, 2019, 9:49 AM IST

న్యాయవాదుల కుటుంబం నుంచి వచ్చి దేశ ప్రధాన న్యాయమూర్తి స్థాయికి ఎదిగిన వ్యక్తి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. 63 ఏళ్ల జస్టిస్​ బోబ్డే... 17 నెలల పాటు భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు. 2021 ఏప్రిల్​ 23న పదవీవిరమణ చేయనున్నారు.

ప్రముఖ సీనియర్​ న్యాయవాది అరవింద్​ శ్రీనివాస్​ బోబ్డే కుమారుడు జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే. సీనియారిటీ​ నియమం ప్రకారం జస్టిస్​ రంజన్​ గొగొయి తదుపరి సీజేఐగా జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే పేరును ప్రతిపాదిస్తూ కేంద్రానికి లేఖ రాశారు. ఆయన నియామకాన్ని ఆమోదిస్తూ రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సంతకం చేశారు.

సాధారణ న్యాయమూర్తి నుంచి సీజేఐ వరకు ఆయన ప్రస్థానం..

  1. 1956 ఏప్రిల్​ 24న మహారాష్ట్ర నాగ్​పుర్​లో జస్టిస్​ బోబ్డే జన్మించారు. నాగ్​పుర్​ విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్​ ఆఫ్​ ఆర్ట్స్​, ఎల్​ఎల్​బీ డిగ్రీ పట్టాలు పొందారు.
  2. 1978లో మహారాష్ట్ర బార్​ కౌన్సిల్​లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ఆరంభించారు.
  3. బొంబే హైకోర్ట్​ నాగ్​పుర్​ బెంచ్​లో లా ప్రాక్టీస్​ చేశారు జస్టిస్​ బోబ్డే.
  4. 1998లో సీనియర్​ న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
  5. 2000 మార్చి 29న బొంబే హైకోర్ట్​కు అదనపు జడ్జిగా నియమితులయ్యారు.
  6. 2012 అక్టోబర్​ 16న మధ్యప్రదేశ్​ హైకోర్ట్​ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.
  7. 2013 ఏప్రిల్​ 12న సుప్రీం కోర్ట్​ న్యాయమూర్తిగా జస్టిస్​ ఎస్​ఏ బోబ్డేకు పదోన్నతి లభించింది.

కీలక తీర్పులు...

  • అయోధ్యలోని వివాదాస్పద భూమిలో రామమందిర నిర్మాణానికి అనుమతిస్తూ సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పును వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్​ ఎస్ఏ బోబ్డే సభ్యులు.
  • 2017 ఆగస్ట్​లో..'గోప్యత హక్కు.. ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు' అని తీర్పు ఇచ్చిన అప్పటి సీజేఐ జస్టిస్ జగదీశ్​ సింగ్​ కేహర్​ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల రాజ్యంగ ధర్మాసనంలో జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ఒకరు.
  • సీజేఐ జస్టిస్ రంజన్​ గొగొయిపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపై విచారణ చేసిన ముగ్గురు సభ్యుల అంతర్గత విచారణ కమిటీకి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వం వహించారు. సుప్రీం మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలు నిరాధారమైవని తేల్చి.. జస్టిస్​ గొగొయికి క్లీన్‌చిట్‌ ఇచ్చారు.
  • ఆధార్​ కార్డ్​ లేని భారత పౌరులకు సాధారణ సేవలు, ప్రభుత్వ సేవలు నిలిపివేయొచ్చని 2015లో నిర్ణయం తీసుకున్న ముగ్గురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే ఒకరు.
  • క్రికెట్​ పాలకుల కమిటీ (సీఓఏ)కి అధ్యక్షుడిగా ఉన్న మాజీ కాగ్​ వినోద్​ రాయ్​ను రాజీనామా చేసి ఎన్నికైన వ్యక్తులకు బోర్డ్​ వ్యవహారాలు అప్పజెప్పాలని ఇటీవల ఆదేశించిన సుప్రీం ధర్మాసనానికి జస్టిస్​ ఎస్​ఏ బోబ్డే నేతృత్వం వహించారు.

ఇదీ చూడండి: ప్రధానితో 'బంధం' గురించి జెన్నిఫర్​ చెప్పిన కథ ఇది!

ABOUT THE AUTHOR

...view details