తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు - Civil services examinations

Civil services examinations
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు

By

Published : Jun 5, 2020, 4:12 PM IST

Updated : Jun 5, 2020, 4:39 PM IST

16:31 June 05

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు

కరోనా మహమ్మారి విజృంభణతో వాయిదాపడ్డ సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష తేదీని వెల్లడించింది యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (యూపీఎస్​సీ). ఈ ఏడాది అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.  

గతేడాది సివిల్​ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్​ ఎగ్జామ్స్​లో ఉత్తీర్ణులైన వారికి సంబంధించిన పర్సనాలిటీ టెస్ట్​ పైనా స్పష్టతనిచ్చింది. ఈ పరీక్షలను జులై 20 నుంచి పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది.  

ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష మే 31న నిర్వహించాల్సి ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​తో వాయిదా పడింది.  కొత్త తేదీలను ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు రద్దవుతాయనే ప్రచారానికి తెరపడినట్లయిందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​.  

ఈ ఏడాది యూపీఎస్​సీ పరీక్షల షెడ్యూల్​

  • సెప్టెంబర్​ 6న ఎన్​డీఏ, ఎన్​ఏ పరీక్ష
  • అక్టోబర్​ 4న సివిల్స్​ ప్రిలిమినరీ, ఐఎఫ్​ఎస్​ పరీక్ష
  • అక్టోబర్​ 16న ఐఈఎస్​, ఐఎస్​ఎస్​ పరీక్ష
  • 2021 జనవరి 8న సివిల్స్​ మెయిన్స్​
  • 2021 ఫిబ్రవరి 28న ఐఎఫ్​ఎస్​ మెయిన్స్​

16:09 June 05

సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఖరారు

సివిల్​ సర్వీసెస్​ ప్రిలిమినరీ పరీక్ష తేదీని వెల్లడించింది యూపీఎస్సీ. ఈ ఏడాది అక్టోబరు 4న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

గతేడాది సివిల్​ సర్వీసెస్ ఎగ్జామ్స్​కు సంబంధించిన పర్సనాలిటీ టెస్ట్​ పైనా స్పష్టతనిచ్చింది. ఈ పరీక్షలను జులై 20 నుంచి పునఃప్రారంభించనున్నట్లు వెల్లడించింది.

Last Updated : Jun 5, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details