తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

china-india
గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

By

Published : Jul 6, 2020, 12:00 PM IST

Updated : Jul 6, 2020, 1:11 PM IST

12:53 July 06

గల్వాన్ లోయ నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గాయి. తమకు చెందిన వాహనాలు, గుడారాలను 1 నుంచి 2 కిలోమీటర్ల మేర వెనక్కి తరలించింది చైనా. అయితే గల్వాన్‌ నదీ లోయలో ఇప్పటికీ చైనాకు చెందిన భారీ సాయుధ వాహనాలు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.  

సరిహద్దు ఘర్షణ అనంతరం ఇరు దేశాల సైనిక కమాండర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు చైనా బలగాలను ఉపసంహరిస్తోందని తెలుస్తోంది.

పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద..

పెట్రోలింగ్ పాయింట్ 14 వద్ద చైనా సైన్యం గుడారాలు, నిర్మాణాలు తొలగిస్తూ కనిపించిందని వెల్లడించింది భారత సైన్యం. గోగ్రా హాట్ స్ప్రింగ్ ప్రాంతంలోనూ ఉపసంహరణలు చేసిందని చెప్పింది.  

ఇదీ జరిగింది..

మే 4న తూర్పు లద్దాఖ్​లో చైనా బలగాల మోహరింపుతో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ నేపథ్యంలో సైనిక ఉపసంహరణకు తొలి దఫాలో జూన్ 6న ఇరుదేశాల సైనిక కమాండర్ల స్థాయిలో సంప్రదింపులు జరిగాయి. అయితే జూన్ 15, 16 తేదీల్లో జరిగిన ఘర్షణల్లో భారత్​కు చెందిన 20 మంది జవాన్లు అమరులు కావడం, చైనా సైనికుల్లో పలువురు మృతి చెందడం వల్ల చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.

అయితే ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరు దేశాల అంగీకారం మేరకు జూన్ 22న రెండో దఫా చర్చలు జరిగాయి. ఈ సమావేశం వేదికగానే సైనిక ఉపసంహరణకు ఇరువర్గాల మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. జులై 1న మూడో దఫాలో 12 గంటల పాటు జరిగిన సుదీర్ఘ సమావేశంలో అంతిమ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

12:06 July 06

  • భారత్‌ - చైనా కమాండర్ల స్థాయి అధికారుల చర్చల్లో పురోగతి
  • గల్వాన్‌ సరిహద్దు వద్ద 1 నుంచి 2 కి.మీ. మేర వెనక్కి తగ్గిన చైనా బలగాలు
  • బలగాలతోపాటు వాహనాలనూ వెనక్కి మళ్లించిన చైనా
  • సరిహద్దు వద్ద గుడారాలు తొలగించిన చైనా బలగాలు
  • గల్వాన్‌ నదీ లోయలో ఇప్పటికీ చైనాకు చెందిన భారీ సాయుధ వాహనాలు
  • పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్న భారత సైన్యం

11:55 July 06

గల్వాన్​ నుంచి వెనక్కి తరలిన చైనా సైన్యం

గల్వాన్​ లోయ నుంచి చైనా సైనికులు రెండు కిలోమీటర్ల వెనక్కి వెళ్లినట్లు భారత ఆర్మీ తెలిపింది. అయితే చైనా సైన్యానికి చెందిన భారీ సాయుధ వాహనాలు  లోయలో ఉన్నట్లు పేర్కొంది.

Last Updated : Jul 6, 2020, 1:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details