స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఛత్తీస్‌గఢ్ రాయ్‌పుర్‌లో విద్యార్థులు, సైనికాధికారులు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరవీరుల త్యాగాలను, త్రివర్ణపతాకం గొప్పతనాన్ని తెలియజేసేలా.. 15 కిలోమీటర్ల మేర జాతీయ జెండాతో మానవహారాన్ని ఏర్పాటు చేశారు.
" ఛత్తీస్‌గఢ్, రాయ్‌పుర్‌లోని వివిధ పాఠశాలల నుంచి 8500 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ప్రపంచ రికార్డు సాధించేందుకు 15 కిలోమీటర్ల త్రివర్ణ పతాకాన్ని తయారు చేశాం. ఇక్కడి నుంచి ఐదు కిలోమీట్ల మేర మూడు వరుసల్లో జెండాతో మానవహారం ఏర్పాటు చేయటం జరిగింది. సైన్స్ కళాశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. "