తమిళనాడు చెన్నైలోని తాంబరంలో విషాద ఘటన జరిగింది. రిఫ్రిజిరేటర్ పేలి మంటలు చెలరేగి.. ఓ జర్నలిస్టు కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది.
ప్రసన్న జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. అతని భార్య అర్చన ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వీరితో పాటు ప్రసన్న తల్లి రేవతి కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వీరంతా రాత్రి నిద్రిస్తున్న సమయంలో రిఫ్రిజిరేటర్ పేలి మంటలు చెలరేగాయి. దీంతో వీరు అక్కడికక్కడే మరణించారు.
రిఫ్రిజరేటర్ పేలి జర్నలిస్టు కుటుంబం మృతి
తమిళనాడు తాంబరంలో ఓ ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఓ జర్నలిస్టు కుటుంబం మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఫ్రిజ్ పేలి జర్నలిస్టు సహా ముగ్గురు మృతి
ఉదయం ఎప్పటిలాగే పని మనిషి ఇంటికి వచ్చింది. తలుపు కొట్టినా.. ఎంతకీ తెరవలేదు. కంగారు పడి ఇరుగుపొరుగు వారిని పిలిచింది. అందరూ కలిసి తలుపులు తెరవగా ప్రసన్న కుటుంబసభ్యుల మృత దేహాలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: జమ్ముకశ్మీర్లో రోడ్డు ప్రమాదం, 11మంది మృతి
Last Updated : Jun 28, 2019, 10:29 AM IST