ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్లో నక్సలైట్లకు, భద్రత బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ నక్సల్తో పాటు సీఆర్పీఎఫ్లోని కోబ్రా విభాగానికి చెందిన జవాన్లు మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్- ఓ నక్సలైట్, ఇద్దరు జవాన్లు మృతి - encounter in bastar Chattisgarh
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్లో జరిగిన ఎన్కౌంటర్లో ఓ నక్సలైట్ హతమయ్యాడు. సీఆర్పీఎఫ్లోని కోబ్రా విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు.
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్
"ఓ నక్సలైట్ మరణించాడు. అతడి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. నలుగురు కోబ్రా కమాండోలు గాయపడ్డారు. అందులో ఇద్దరు మృతిచెందారు."-సీఆర్పీఎఫ్ అధికారులు
ఉదయం 10:30 గంటలకు సుక్మా, బిజాపూర్ జిల్లాల సరిహద్దులో ఉన్న ఇరాపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఈ కాల్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గాయపడ్డ ఇద్దరిలో ఒకరు డిప్యూటీ కమాండో హోదా ఉన్న అధికారి ఉన్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 29, 2020, 9:00 PM IST