బిహార్ ఛప్రాలోని ఓ పోలింగ్ బూత్‌లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సారన్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాన్ని(ఈవీఎం)ను ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. అతణ్ని రంజిత్ పాసవాన్గా గుర్తించిన పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేశారు.
బిహార్ ఛప్రాలో ఈవీఎం ధ్వంసం- వ్యక్తి అరెస్టు - కేంద్రం
సార్వత్రిక ఎన్నికల ఐదో దశలో అక్కడక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. బిహార్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో రంజిత్ పాసవాన్ అనే వ్యక్తి.. ఈవీఎంను పగులకొట్టాడు. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఛప్రాలో ఈవీఎం ధ్వంసం.. వ్యక్తి అరెస్టు
బిహార్‌లో మిగతా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.95 శాతం ఓటింగ్ నమోదైంది.