తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్-2 ఆర్బిటర్​ అత్యుత్తమం: ఇస్రో మాజీ ఛైర్మన్​

చంద్రయాన్-2 ఆర్బిటర్​కు ఉత్తమ ఫలితాలు సాధించగల సామర్థ్యం ఉందన్నారు ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్. చంద్రయాన్-1తో పోల్చితే చంద్రయాన్-2 ఆర్బిటర్​లో క్లిష్టమైన సాధనాలు అమర్చారని తెలిపారు.

చంద్రయాన్-2 ఆర్బిటర్​ అత్యుత్తమం: ఇస్రో మాజీ ఛైర్మన్​

By

Published : Sep 13, 2019, 5:40 AM IST

Updated : Sep 30, 2019, 10:14 AM IST

'చంద్రయాన్-2 ఆర్బిటర్​ అత్యుత్తమం'

భారత్​ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో తుది ఘట్టం మినహా మిగతా కార్యకలాపాలన్నీ ప్రణాళికాబద్ధంగా జరిగాయని చెప్పారు ఇస్రో మాజీ ఛైర్మన్​ కిరణ్​ కుమార్. చంద్రయాన్​-2 ఆర్బిటర్​ అత్యుత్తమ ఫలితాలు సాధించగల సమర్థవంతమైనదని తెలిపారు. దశాబ్ద కాలం క్రితం నిర్వహించిన చంద్రయాన్​-1 ప్రయోగంలోని ఆర్బిటర్​తో పోల్చితే చంద్రయాన్​-2 ఆర్బిటర్​లో క్లిష్టమైన సాధనాలు సమకూర్చినట్లు వివరించారు కిరణ్. చంద్రయాన్ ప్రాజెక్టులలో వినియోగించిన సాధనాల గురించి సరళంగా చెప్పారు.

చంద్రయాన్-1లో ఉపయోగించిన నాసా జేపీఎల్ పరికరాలతో పోల్చితే.. చంద్రయాన్​-2 పరికరాలు మెరుగైన పనితీరు కనబరిచాయని వివరించారు. వీటి పరిధి మూడు మైక్రాన్ల నుంచి ఐదు మైక్రాన్లు​గా ఉందన్నారు.

వీటితో మెరుగైన ఫలితాలు..

చంద్రయాన్​-1లో ఒక సింథటిక్ అపెర్చుర్ రాడార్​ను వినియోగిస్తే... చంద్రయాన్​-2లో రెండు ఫ్రీక్వెన్సీ రాడార్లను ఉపయోగించారని, ఇవి మెరుగైన ఫలితాలకు దోహదపడతాయని పేర్కొన్నారు కిరణ్. అత్యంత నాణ్యమైన కెమెరాలు వాడినట్లు తెలిపారు.

చంద్రయాన్​-2 ప్రాజెక్టు చివరి ఘట్టంలో చంద్రుని ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో ల్యాండర్​ విక్రమ్​తో సంబంధాలు తెగిపోయాయి. సంబంధాలు పునరుద్ధరించేందుకు ఇస్రో తీవ్రంగా శ్రమిస్తోంది.

ఇదీ చూడండి: 'మోదీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తోంది'

Last Updated : Sep 30, 2019, 10:14 AM IST

ABOUT THE AUTHOR

...view details