తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చంద్రయాన్​-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం - ల్యాండర్​

జులై 15న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చేపట్టబోయే చంద్రయాన్​-2 ప్రయోగంపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. 2008లో ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్​-1కు ఇది కొనసాగింపే అయినా.. ఎంతో ప్రత్యేకం. ఆ విశేషాలేంటో తెలుసుకోండి...

చంద్రయాన్​-1కు కొనసాగింపే కానీ... ప్రత్యేకం

By

Published : Jul 13, 2019, 5:04 PM IST

చంద్రయాన్​-2లో ఎన్నో ప్రత్యేకతలు

చంద్రయాన్​-2 ప్రయోగం విజయవంతమైతే.. అమెరికా, రష్యా, చైనా సరసన నిలుస్తుంది భారత్​. ఇప్పటివరకు ఆ దేశాల రోవర్​లు మాత్రమే చందమామపై మృదువుగా ల్యాండ్​ అయ్యాయి.

భారత్​ 2008లోనే ప్రయోగించిన చంద్రయాన్​-1కు కొనసాగింపు చంద్రయాన్​-2. అయితే.. దీనికెన్నో ప్రత్యేకతలున్నాయి. అప్పటి ప్రయోగం.. కేవలం జాబిల్లి కక్ష్యకే పరిమితమై సమాచారాన్ని సేకరించి భూమికి పంపింది. అంతరిక్షంలో భారత్​ ముద్ర ఉండాలన్న బలమైన ఉద్దేశంతో చంద్రయాన్​-1లో 35 కిలోల ఇంపాక్టర్​ను చంద్రుడి ఉపరితలంపైకి జారవిడిచింది. అది బలంగా చంద్రుడిని ఢీకొట్టింది.

చంద్రయాన్​-2లోని ల్యాండర్​, రోవర్​ మాత్రం చంద్రుడి ఉపరితలంపైకి సున్నితంగా దిగుతాయి. ముఖ్యంగా రోవర్.. చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ ప్రయోగాలు చేస్తుంది. స్వీయ పరికరాలతో ఫొటోలూ తీసి అక్కడి వివరాలను భూమికి పంపుతుంది. కాబట్టి చంద్రయాన్​-1తో పోలిస్తే... ఇప్పుడు ప్రయోగించనున్న చంద్రయాన్​-2 ఎంతో క్లిష్టమైన, ప్రతిష్టాత్మక భారీ ప్రయోగం.

అందుకే ఇస్రో తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏ మాత్రం పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ పరికరాలన్నింటినీ రూపొందించింది.

దక్షిణ ధ్రువంపై తొలిసారి...

చంద్రయాన్​-2తో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్​ను ల్యాండ్ చేసిన తొలి దేశంగా భారత్​ చరిత్ర సృష్టించనుంది. ఇప్పటివరకు ఏ దేశమూ ఈ ఘనత సాధించలేదు. దక్షిణ ధ్రువంపై అనుకూల పరిస్థితులే.. ల్యాండ్​ చేయాలనుకోవడానికి ఓ కారణం.

సౌరకుటుంబానికి సంబంధించిన ఎన్నో అంతుచిక్కని విషయాలు దక్షిణ ధ్రువంపైనే నిక్షిప్తమై ఉన్నాయని భావిస్తున్నారు. నీటి జాడ ఉంటుందని.. తద్వారా ఇక్కడ ఆవాసానికి ప్రత్యమ్నాయ మార్గాలు సృష్టించుకోవచ్చని విశ్వసిస్తున్నారు.

ఇదీ చూడండి:

చంద్రయాన్​-2తో రోదసిలో మనది ప్రత్యేక ముద్ర!

ABOUT THE AUTHOR

...view details