తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్​ఆర్​సీ: అసోంకు 51 కంపెనీల అదనపు బలగాలు - police forces

అసోం జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్​ఆర్​సీ) తుది జాబితా నేడు విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. ఇప్పటికే 167 కంపెనీల బలగాలను మోహరించగా... అదనంగా మరో 51 కంపెనీలను పంపింది కేంద్రం.

అసోంకు 51 కంపెనీల అదనపు బలగాలు

By

Published : Aug 31, 2019, 9:19 AM IST

Updated : Sep 28, 2019, 10:57 PM IST

జాతీయ పౌర రిజిస్టర్​ తుది జాబితా (ఎన్​ఆర్​సీ) విడుదల నేపథ్యంలో అసోంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఎలాంటి, అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ప్రాంతాల్లో బలగాలను మోహరించారు. ఇప్పటికే 167 కంపెనీల బలగాలను రంగంలోకి దించగా.. అదనంగా మరో 51 కంపెనీలను మోహరించారు.

అన్ని కోణాల్లో భద్రతను పరిశీలించి ప్రజల్లో అవగాహన కల్పించే చర్యలు తీసుకుంటున్నట్లు అసోం డీజీపీ కులధర్ సైకియా తెలిపారు. సామాజిక మాధ్యమాలను పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు వార్తలు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అసోం ప్రజలు శాంతియుతంగా ఉంటారని భావిస్తున్నామన్నారు డీజీపీ. అసోం పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు.

మొత్తం 2,500 ఎన్​ఆర్​సీ సేవాకేంద్రాలకు గానూ.. 1200 కేంద్రాలు సమస్యాత్మకంగా ఉన్నాయని కులధర్ తెలిపారు. అన్ని ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసున్నామన్నారు.

ఇదీ చూడండి: నేడు ఎన్​ఆర్​సీ విడుదల... అసోంలో భయాందోళనలు!

Last Updated : Sep 28, 2019, 10:57 PM IST

ABOUT THE AUTHOR

...view details