తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అంకురాలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక ఛానెల్' - డీడీ శ్రేణి

కార్మిక సంక్షేమ చట్టాలను మెరుగుపరుస్తామన్నారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. అంకుర సంస్థలకు సంబంధించి డీడీ పరంపరలో ప్రత్యేక ఛానెల్​ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020 నుంచి 2025 వరకూ స్టాండ్ అప్ ఇండియా పథకాన్ని కొనసాగిస్తామన్నారు.

'అంకురాలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక ఛానెల్'

By

Published : Jul 5, 2019, 4:10 PM IST

Updated : Jul 5, 2019, 5:00 PM IST

ఔత్సాహిక యువతను వ్యాపారులుగా మార్చే ప్రయత్నాలను కేంద్రం మరింత ముమ్మరం చేయనుంది. అంకుర సంస్థలపై డీడీ శ్రేణిలో ఓ ఛానెల్​ను ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు అంకురాల్లో ఎదురయ్యే సమస్యలపై అవగాహన.., వ్యాపారికి, పెట్టుబడిదారికి మధ్య పరిచయాన్ని ఈ ఛానెల్ ద్వారా చేపడతామని ప్రకటించారు.

కార్మిక సంక్షేమానికి సంబంధించిన చట్టాలను మెరుగుపరుస్తామని ప్రకటించారు నిర్మల.

'అంకురాలకు మరింత ప్రోత్సాహం, ప్రత్యేక ఛానెల్'

"కార్మిక సంక్షేమానికి సంబంధించిన చట్టాలను మెరుగుపరుస్తాం. వివిధ కార్మిక చట్టాలన్నింటినీ నాలుగు స్మృతుల కిందకు మారుస్తాం. తద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రిటర్నుల దాఖలు ప్రామాణికంగా మారుతాయి. ఈ నూతన చట్టాల ద్వారా వివాదాలు తక్కువవుతాయి.

డీడీలో అంకుర వ్యాపారాల కోసం మరో నూతన ఛానెల్​ను ప్రవేశపెట్టనున్నాం. ఈ ఛానెల్ అంకురాలకు ప్రోత్సాహం కల్పించేదిగా ఉంటుంది. అంకురాల్లో ఎదురయ్యే సమస్యలు, ఔత్సాహిక వ్యాపారులకు, పెట్టుబడిదారులకు పరిచయం చేయటం, పన్నులపై అవగాహన వంటి కార్యక్రమాలు ప్రసారం చేస్తాం. ఈ ఛానెల్​ను అంకుర సంస్థల ద్వారానే ఏర్పాటు చేయిస్తాం.

స్టాండ్ అప్ ఇండియా ద్వారా ఎన్నో ప్రయోజనాలు చేకూరాయి. మహిళలు, ఎస్సీ, ఎస్టీల్లో వేల మంది వ్యాపారులు తయారయ్యారు. వారికి సొంత వ్యాపారాలు పెట్టుకునేందుకు అవకాశం కల్పించాం. స్టాండ్ అప్ ఇండియా అందించిన పెట్టుబడి ద్వారా ఎస్సీ, ఎస్టీల్లో వస్తోన్న ప్రతిస్పందన చూసి 2020 నుంచి 2025 వరకు ఉండనున్న 15వ ఆర్థిక సంఘంలోనూ ఈ పథకాన్ని కొనసాగించనున్నాం. "

-నిర్మలా సీతారామన్, ఆర్థిక మంత్రి

ఇదీ చూడండి: 'నవభారత్​ నిర్మాణానికి మార్గం ఈ బడ్జెట్​'

Last Updated : Jul 5, 2019, 5:00 PM IST

ABOUT THE AUTHOR

...view details