తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఫుట్​బాల్​ అనుకున్నారా?' - ఈవీఎంలపై స్పందన

ఈవీఎంలను ఫుట్​బాల్​లా ఆడుకుంటున్నారని సీఈసీ సునీల్ అరోరా ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈవీఎంలపై సీఈసీ

By

Published : Mar 1, 2019, 9:11 PM IST

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఫుట్​బాల్​లా ఆడుకుంటున్నారని భారత ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ అరోరా మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణను పరిశీలించేందుకు లఖ్​నవూలో రెండు రోజులుగా పర్యటిస్తున్నారు అరోరా. ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయటాన్ని తప్పుబట్టారు.

"రెండు దశాబ్దాలుగా ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. 2014 లోక్​సభ ఎన్నికలు, అనంతరం దిల్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే తేడా ఏంటో తెలుస్తుంది. తెలిసో తెలియకో ఈవీఎంలను ఫుట్​బాల్​ లాగా తయారుచేశాం. ఫలితాలు అనుకూలంగా వస్తే సరే.. లేదంటే తప్పు అన్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. అందుకే వీవీప్యాట్​ను ప్రవేశపెట్టాం." -సునీల్ అరోరా, ప్రధాన ఎన్నికల అధికారి

ఈవీఎంలను మంచి ప్రమాణాలు పాటించే సంస్థలు తయారు చేశాయని అరోరా తెలిపారు. ఎన్నికల సంఘాన్ని మించి సాంకేతిక సలహా కమిటీకి నిర్ణయాధికారాలు ఉన్నాయని, అందులోని గొప్ప శాస్త్రవేత్తల పనితనంపై అనుమానాలు అక్కర్లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details