తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శాంతి అంటూనే... కయ్యానికి - Balakote

భారత్​తో శాంతి చర్చలకు సిద్ధమంటూనే కదనానికి కాలు దువ్వుతోంది పాకిస్థాన్​. సరిహద్దు వెంబడి కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘిస్తోన్న పాక్​

By

Published : Mar 1, 2019, 7:41 PM IST

భారత్‌- పాక్‌ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాక్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్‌ మరోమారు ఉల్లఘించింది. జమ్ముకశ్మీర్ మేంఢర్​​, బాలాకోట్​, కృష్ణఘాటి సెక్టార్లలో పాక్‌ సైన్యం కాల్పులకు తెగబడింది.

జమ్ముకశ్మీర్ ఉరీ సెక్టార్‌లోని కామల్‌కోట్‌లో పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఓ పౌరుడికి గాయాలయ్యాయి. పాక్‌ రేంజర్ల కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

శాంతి అంటూనే...

పుల్వామా ఘటనతో ఇరు దేశాల మధ్య పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పాక్​లోని ఉగ్రవాద స్థావరాలను భారత వాయుసేన ధ్వంసం చేసింది. అంతర్జాతీయంగా పాకిస్థాన్​ను ఏకాకి చేయటంలో భారత్​ విజయవంతమైంది.

అంతర్జాతీయంగా వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గిన పాక్​ భారత్​తో శాంతి చర్చలకు సిద్ధమంటూ ప్రకటనలు చేసింది. కానీ తన వక్రబుద్ధిని మాత్రం మార్చుకోలేదు. ఓ పక్క శాంతి, శాంతి అంటూనే భారత్​తో కయ్యానికి కాలు దువ్వుతోంది. సరిహద్దుల వెంబడి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతోంది.

ABOUT THE AUTHOR

...view details