తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒకరి అతివేగం.. తీసింది ఇద్దరి ప్రాణం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హడోనహళ్లిలో వేగంగా బైక్​పై వచ్చిన ఓ వ్యక్తి.. మరో బైక్​పై రోడ్డు దాటుతోన్న వ్యక్తిని ఢీకొట్టడం వల్ల ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

accident in karnataka
అతివేగంగా వెళ్లి బైక్​ను ఢీకొట్టి- ఇద్దరు మృతి

By

Published : Jan 16, 2021, 6:00 PM IST

అతివేగంగా వెళ్లి బైక్​ను ఢీకొట్టిన దృశ్యం

కర్ణాటకలో హడోనహళ్లిలో.. అతివేగం ఇద్దరు ద్విచక్ర వాహనదారుల ప్రాణాలు బలితీసుకుంది. ద్విచక్రవాహనంపై వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యక్తి.. బైక్‌ మీద రోడ్డు దాటుతున్న మరో వ్యక్తిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

మృతుల్లో ఒకరిని తిప్పాంగనహళ్లికి చెందిన సాగర్‌గా గుర్తించగా మరొకరిని ఇంకా గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:టీకా వేయించుకున్న సీరమ్‌ అధినేత

ABOUT THE AUTHOR

...view details