లంచం ఆరోపణలు ఎదుర్కొన్న సీబీఐ మాజీ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాకు విచారణలో మానసిక, సత్యశోధన పరీక్షలు ఎందుకు నిర్వహించలేదని దిల్లీ న్యాయస్థానం సీబీఐని ప్రశ్నించింది. ఈ కేసు ప్రారంభంలో దర్యాప్తు అధికారిగా పని చేసిన అజయ్ కుమార్ బస్సీ ఈనెల 28న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన దిల్లీ న్యాయస్ధానం పెద్ద ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు బయట ఎలా స్వేచ్ఛగా తిరగ గల్గుతున్నారని ప్రశ్నించింది.