తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెప్టెంబర్​ 5 వరకు చిదంబరం కస్టడీ పెంపు

చిదంబరం సీబీఐ కస్టడీ మళ్లీ పొడిగింపు

By

Published : Sep 3, 2019, 2:53 PM IST

Updated : Sep 29, 2019, 7:13 AM IST

17:11 September 03

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసు విచారణలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సీబీఐ కస్టడీని సవాల్​ చేస్తూ దాఖలైన పిటిషన్​ను విచారించిన సుప్రీంకోర్టు... కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి సెప్టెంబర్​ 5 వరకు కస్టడీ పొడిగించాలని ఆదేశాలు జారీ చేసింది.  

గురువారమే చిదంబరం బెయిల్​ పిటిషన్​ను విచారించాల్సిందిగా ట్రయల్​ కోర్టును ఆదేశించింది. అప్పటివరకు బెయిల్​ కోసం ట్రయల్ కోర్టుపై ఎలాంటి ఒత్తిడి చేయరాదని చిదంబరం తరఫు న్యాయవాదులకు కోర్టు సూచించింది. సెప్టెంబర్ 5 వరకు చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించొద్దని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది

సుప్రీంకు అనుగుణంగా....

కాసేపటికే... చిదంబరం వ్యవహారం దిల్లీ సీబీఐ కోర్టుకు చేరింది. ఒక్క రోజు కస్టడీ ముగియడం వల్ల ఆయన్ను ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరిచింది దర్యాప్తు సంస్థ. సుప్రీంకోర్టు చిదంబరానికి సెప్టెంబర్​ 5 వరకు కస్టడీ పొడిగించాలని ఆదేశించిందని సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా కోర్టుకు నివేదించారు. అందుకు అనుగుణంగా నిర్ణయం ప్రకటించింది దిల్లీ కోర్టు.

"సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రతిని సుప్రీం అధికారిక వెబ్​సైట్​ నుంచి సిబ్బంది తీసుకున్నారు. సొలిసిటర్​ జనరల్​ సుప్రీం ఆదేశాల వివరాలను వెల్లడించారు. వీటిని పరిశీలించగా.. సెప్టెంబర్​ 5 వరకు చిదంబరం సీబీఐ కస్టడీలోనే ఉండటం సమంజసం అని భావిస్తున్నాం. సెప్టెంబర్​ 5న నిందితుడ్ని తిరిగి ప్రవేశపెట్టవలసిందిగా సీబీఐని ఆదేశిస్తున్నాం."       
            - సీబీఐ కోర్టు

​మధ్యంతర బెయిల్​ ఇవ్వాలని తాము ఇప్పుడు కోరడం లేదని..  సెప్టెంబర్​ 5న పరిశీలించాలని చిదంబరం తరఫు న్యాయవాదులు అభ్యర్థించారు. సుప్రీంకోర్టులో కస్టడీ పొడిగించరాదని.. చిదంబరాన్ని తీహార్​ జైలుకు పంపాలని కోరిన సీబీఐ.. ట్రైల్​ కోర్టులో మాత్రం రెండు రోజుల పాటు కస్టడీ పొడిగించాలని కోరడం గమనార్హం.   

15:55 September 03

దిల్లీ కోర్టు నిర్ణయం అదే...

ఐఎన్​ఎక్స్​  మీడియా కేసులో చిదంబరానికి సెప్టెంబర్​  5 వరకు కస్టడీ పొడిగిస్తూ దిల్లీ కోర్టు  ఆదేశాలిచ్చింది. అంతకుముందు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే సుప్రీంలో కస్టీడీ వద్దని వాదించిన సీబీఐ దిల్లీ కోర్టులో రెండు రోజుల కస్టడీ కోరడం గమనార్హం. చిదంబరం బెయిల్​ పిటిషన్​పై సెప్టెంబర్​ 5 తర్వాతే విచారించనుంది న్యాయస్థానం.

14:56 September 03

మాకు కస్టడీ పొడిగింపు వద్దు: సీబీఐ

కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం కస్టడీని సెప్టెంబర్​ 5 వరకు పొడిగించింది సుప్రీం కోర్టు. మరో వైపు కేంద్ర దర్యాప్తు సంస్థ.. చిదంబరం కస్టడీని ఇంకా పొడిగించాల్సిన అవసరం లేదని... ఆయనను తీహార్​ జైలుకు పంపించాలని అభ్యర్థించింది. 

14:43 September 03

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్​ సీనియర్​ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సీబీఐ కస్టడీని సెప్టెంబర్​ 5 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది సుప్రీం కోర్టు. 

చిదంబరం మధ్యంతర బెయిల్​ పిటిషన్​ విచారణకు ట్రయల్​ కోర్టుపై ఒత్తిడి చేయవద్దని చిదంబరం తరఫు న్యాయవాదులను కోరింది సుప్రీం. ట్రయల్​ కోర్టు నిర్ణయం తర్వాత ఈ అంశంపై విచారిస్తామని స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.


 

Last Updated : Sep 29, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details