తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిదంబరం కస్టడీ పొడిగింపు.. అక్టోబర్​ 3 వరకు తిహార్​లోనే - సీబీఐ

'ఐఎన్​ఎక్స్​ కేసు': ముగిసిన కస్టడీ.. కోర్టుకు చిదంబరం

By

Published : Sep 19, 2019, 2:41 PM IST

Updated : Oct 1, 2019, 5:02 AM IST

15:27 September 19

చిదంబరం కస్టడీ పొడిగింపు.. అక్టోబర్​ 3 వరకు తిహార్​లోనే

కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం సీబీఐ కస్టడీని పొడిగించింది దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం. కేంద్ర దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు... అక్టోబర్​ 3 వరకు రిమాండ్​ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ కుమార్​. 

14:50 September 19

జ్యుడీషియల్​ కస్టడీ పొడిగించండి: దిల్లీ కోర్టుకు సీబీఐ

14 రోజుల జ్యుడీషియల్​ కస్టడీ ముగిసిన అనంతరం.. నేడు దిల్లీ కోర్టులో చిదంబరాన్ని హాజరుపరిచారు. మరికొన్ని రోజులు కస్టడీ పెంచాలని ప్రత్యేక న్యాయమూర్తి అజయ్​ను కోరింది సీబీఐ. అయితే.. దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు చిదంబరం తరఫు న్యాయవాది కపిల్​ సిబల్​. చిదంబరానికి ఆరోగ్యం సహకరించడం లేదని.. క్రమంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు ఇచ్చిన నివేదికను కోర్టుకు సమర్పించారు సిబల్​. దిల్లీ ప్రత్యేక న్యాయస్థానం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

14:31 September 19

'ఐఎన్​ఎక్స్​ కేసు': ముగిసిన కస్టడీ.. కోర్టుకు చిదంబరం

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో అవినీతి ఆరోపణలతో అరెస్టయిన చిదంబరం... సీబీఐ జ్యుడీషియల్​ కస్టడీ నేటితో ముగిసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేతను దిల్లీ కోర్టు ఎదుట హాజరుపరిచారు పోలీసులు

అయితే... రిమాండ్​ను మరికొన్ని రోజులు పొడిగించాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశారు చిదంబరం తరఫు న్యాయవాది కపిల్​ సిబల్​. 

Last Updated : Oct 1, 2019, 5:02 AM IST

ABOUT THE AUTHOR

...view details