దిల్లీకి చెందిన డైరీ ఉత్పత్తుల సంస్థ క్వాలిటీ లిమిటెడ్‌పై బ్యాంకు మోసం కేసు నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంను సుమారు రూ. 1,400 కోట్ల మేర మోసం చేసిన ఆరోపణలతో క్వాలిటీ సంస్థ, దాని డైరెక్టర్లకు చెందిన ఎనిమిది ప్రాంతాల్లో సోమవారం సోదాలు నిర్వహించింది. అందులో.. దిల్లీలోని సహరాంపుర్, బులంద్‌షహర్(ఉత్తర్‌ప్రదేశ్), అజ్మెర్ (రాజస్థాన్), పల్వాల్(హరియాణా)లు ఉన్నాయి.
క్వాలిటీ లిమిటెడ్ సంస్థ, దాని డైరెక్టర్లు సంజయ్ ధింగ్రా, సిద్ధాంత్ గుప్తా, అరుణ్ శ్రీవాస్తవాలతో పాటు మరికొందరిపై కేసు నమోదైంది.
"బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని కన్సార్టియంను మోసం చేసినట్లు ఫిర్యాదు అందింది. బ్యాంకు నిధులను మళ్లించటం, సంబంధీకులతో లావాదేవీలు, కల్పిత పత్రాలు, రిసిప్టులు, తప్పుడు అకౌంట్ బుక్స్, కల్పిత ఆస్తులను చూపి సుమారు రూ.1400.62 కోట్ల మోసానికి పాల్పిడినట్లు తెలిసింది."