పశ్చిమ బంగలో 22 చోట్ల తనిఖీలు చేపట్టింది కేంద్ర దర్యాప్తు సంస్థ. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన పోంజి కుంభకోణంలో విచారణ నిమిత్తం సంబంధిత సంస్థల్లో సోదాలు నిర్వహించింది. కేసుతో నిందితులుగా ఉన్న న్యూలాండ్ అగ్రో కంపెనీ డైరెక్టర్లు, ప్రచారకర్తలపై దాడులు నిర్వహించింది.
పోంజి కేసుతో సంబంధం ఉన్న అన్ని కంపెనీలను విచారించాలని సుప్రీం ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యూలాండ్ అగ్రోపై 2017 మేలో కేసు నమోదయింది.