తమిళనాడు శివగంగైలో ఇరులప్పసామిపై చీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సామి కొద్ది రోజుల క్రితం జీవ సమాధి అవుతానని ప్రకటించి.. చివరి క్షణంలో వాయిదా వేశారు. జీవసమాధి కార్యక్రమానికి అన్ని పనులు చేసిన ఓ గుత్తేదారు తనను మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు సామితో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు. సామి కుమారుడితో పాటు మరో ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.
జీవసమాధి@2045: ఇరులప్పసామిపై కేసు నమోదు - జీవ సమాధి
జీవసమాధి అవుతానంటూ ఇటీవల ప్రకటించి చివరిక్షణంలో వాయిదా వేసిన తమిళనాడు శివగంగైకు చెందిన ఇరులప్పసామితో సహా మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో సామి కుమారుడిని, మరో ఇద్దరు శిష్యులను అరెస్టు చేశారు.
జీవసమాధి@2045: ఇరులప్పసామిపై కేసు నమోదు
ఈ నెల 13న అర్ధరాత్రి 12 నుంచి 5 గంటల మధ్య జీవ సమాధి అవుతానని ఇరులప్పసామి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కానీ చివరి క్షణంలో ఏమైందో ఏమోగానీ జీవసమాధి కార్యక్రమాన్ని 25 ఏళ్లకు వాయిదా వేశారు సామి. భూమ్మీద చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని తెలిపారు. అందువల్ల తన జీవ సమాధి 2045 సంవత్సరంలో జరుగుతుందని సెలవిచ్చారు.
ఇదీ చూడండి:'నా ప్రసంగానికి మీ సలహాలు, సూచనలు కావాలి'
Last Updated : Sep 30, 2019, 10:35 PM IST