కర్ణాటక దేవనహల్లి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బోల్తా కొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు చిక్కబల్లపుర్ జిల్లా నక్కలపల్లి గ్రామానికి చెందిన మల్లిఖార్జున రెడ్డి, నాగరాజు, అశోక్ రెడ్డి, సుందర్గా గుర్తించారు అధికారులు.
కర్ణాటకలో కారు బోల్తా.. నలుగురు మృతి - Devanahalli
కర్ణాటకలో కారు ప్రమాదానికి గురై నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దేవనహల్లి జిల్లా సమీపంలో జరిగిన ఈ ఘటన తెల్లవారుజామున చోటుచేసుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
కర్ణాటకలో కారు బోల్తా
క్షతగాత్రులకు హొసకోట్, బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు.
ఇదీ చూడండి : 370 రద్దు: కశ్మీర్లో పరిశ్రమలకు తాళం
Last Updated : Sep 28, 2019, 2:12 AM IST