ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదో విడత సార్వత్రిక పోలింగ్​​కు సర్వం సిద్ధం - FIFTH PHASE

ఐదో విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్​కు సర్వం సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. ఈ నెల 6న జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది.

ఐదో విడత సార్వత్రిక పోలింగ్​​కు సర్వం సిద్ధం
author img

By

Published : May 5, 2019, 5:02 PM IST

ఐదో విడత సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల ఐదో దశ పోలింగ్​ రేపు జరగనుంది. ఎన్నికల వేళ.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈసీ పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. శాంతియుత వాతావరణంలో పోలింగ్​ జరిగేలా చర్యలు తీసుకుంటోంది.

ఐదో దశలో భాగంగా 7 రాష్ట్రాల్లోని 51 లోక్​సభ స్థానాలకు పోలింగ్​ జరగనుంది. ఉత్తర్​ప్రదేశ్​లో 14, రాజస్థాన్​లో 12, పశ్చిమ్​ బంగ, మధ్యప్రదేశ్​లలో 7, బిహార్​లో 5, ఝార్ఖండ్​లో 4, జమ్ములో 2 లోక్​సభ స్థానాలకు ఐదో విడతలో పోలింగ్​ జరగనుంది. 674 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 8 కోట్ల 75 లక్షల మంది ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

in article image
ఐదో విడత సార్వత్రిక పోలింగ్​​కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికలు తుది దశకు వస్తున్న తరుణంలో.. ప్రధాన పార్టీలన్నీ ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తించాయి.

ప్రముఖులు...

ఐదో విడత​లో పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ, ఏఐసీసీ ఛైర్​పర్సన్​ సోనియాగాంధీ బరిలో నిలిచిన స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

మూడు, నాలుగో విడతలో పోలింగ్​ జరిగిన జమ్ముకశ్మీర్​లోని అనంతనాగ్​ లోక్​సభ నియోజకవర్గానికి ఈ విడతలోనూ ఓటింగ్​ జరగనుంది. ఈసారి పుల్వామా, శోపియాన్​ జిల్లాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు జమ్ముకశ్మీర్​లోని లద్దాఖ్​ నియోజకవర్గానికీ పోలింగ్​ నిర్వహించనున్నారు.

భారీ భద్రత నడుమ...

పారదర్శకంగా, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో, హింసాత్మక ఘటనలు జరుగుతున్న పశ్చిమ్​బంగ​లో భారీగా భద్రతా బలగాలను మోహరించింది.

ABOUT THE AUTHOR

...view details