తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విద్యుత్​ తీగలు తగిలి ఆరుగురు మృతి

11కేవీ హై ఓల్టేజ్​ విద్యుత్​ తీగలు​ తాకి.. ఓ బస్సుకు మంటలంటుకున్న ఘటన ఒడిశా జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 40మంది క్షతగాత్రులయ్యారు.

Bus caught fire after coming in contact with an 11 KV wire, 6 Dead
విద్యుత్​ తీగలు తగిలి బస్సుకు మంటలు... ఆరుగురు మృతి

By

Published : Feb 9, 2020, 3:49 PM IST

Updated : Feb 29, 2020, 6:32 PM IST

విద్యుత్​ తీగలు తగిలి బస్సుకు మంటలు

ఒడిశాలోని గంజాం​ జిల్లాలో ఘోర విషాదం జరిగింది. గొలంత్ర పరిధి మంద్​రాజ్​పుర్​ మార్గంలో.. 11కేవీ హై ఓల్టేజ్​ విద్యుత్​ తీగలు తగిలి​ ఓ బస్సుకు మంటలంటుకున్నాయి. ఈ విద్యుదాఘాతంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30మంది గాయపడ్డారు. మంటలు అదుపు చేసిన అనంతరం స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది. అయితే వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

నిశ్చితార్థం వేడుకకు వెళుతుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

Last Updated : Feb 29, 2020, 6:32 PM IST

ABOUT THE AUTHOR

...view details