తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తీరాన్ని తాకక ముందే 'బుల్​బుల్​' ప్రభావం - BULBUL

తీరం దాటక ముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది బుల్​బుల్​ తుపాన్​. ఈ ప్రకృతి విపత్తు వల్ల ఒడిశా, బంగాల్​ రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈదురు గాలుల శబ్దాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి.

తీరాన్ని తాకక ముందే 'బుల్​బుల్​' ప్రభావం

By

Published : Nov 9, 2019, 11:16 PM IST

బుల్​బుల్​ తుపాను ముప్పు వల్ల ఒడిశా, బంగాల్​​ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ప్రకృతి విపత్తు మరో మూడు గంటల్లో... బంగాల్​లోని సాగర్​ ద్వీపం- బంగ్లాదేశ్​లోని ఖెపుపరా ప్రాంతంలో తీరం దాటే అవకాశముంది. బుల్​బుల్​ గంటకు 110-120 కి.మీల వేగంతో దూసుకొస్తుందని.. ఆ సమయంలో ఈదురు గాలులు బలంగా వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.

తీరాన్ని దాటక ముందే 'బుల్​బుల్​' ప్రభావం

తీరాన్ని తాకకముందే తన ప్రతాపాన్ని చూపిస్తోంది తుపాను. భారీ వర్షాల ధాటికి ఇప్పటికే ఒడిశాలో ఒకరు, బంగాల్​లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కోల్​కతాలో గంటకు 50-60 కి.మీల వేగంతో వీస్తున్న ఈదురు గాలులు ప్రజలను భయపెడుతున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. విద్యుత్​ సరఫరాకు తీవ్ర ఆటంకం కలిగింది.

తుపాను నేపథ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం పట్నాయక్​ పరిస్థితులను సమీక్షిస్తున్నారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details