తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉగ్ర కుట్ర భగ్నం- భారీగా ఆయుధాలు స్వాధీనం - 4500 rounds of ammunition found in mizoram

సోమవారం రాత్రి మిజోరాం సరిహద్దులో బీఎస్​ఎఫ్​ జరిపిన సోదాల్లో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఓ డంప్ నుంచి 31 ఏకే 47 రైఫిల్స్​, 4500 రౌండ్స్ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది సరిహద్దు భద్రతా దళం.

BSF 90 Bn recovered 31 AK rifles and 4500 rounds of ammunition found in Mizoram
మిజోరాం సోదాల్లో భారీగా ఆయుధాలు గుర్తించిన బీఎస్​ఎఫ్​

By

Published : Sep 29, 2020, 1:24 PM IST

మిజోరాంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను గుర్తించింది సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్). సోమవారం రాత్రి సరిహద్దుల్లో జరిపిన సోదాల్లో ఈ భారీ డంప్​ను బీఎస్ఎఫ్ 90వ బెటాలియన్​ కనుగొంది. 31 ఏకే 47 రైఫిల్స్, 4500 రౌండ్స్ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది.

మిజోరాం సోదాల్లో భారీగా ఆయుధాలు గుర్తించిన బీఎస్​ఎఫ్​

క్షేత్ర స్థాయి నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు బీఎస్​ఎఫ్​ ఈ సోదాలు నిర్వహించింది. మిజోరాంకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. సోదాల్లో భారీగా ఆయుధ సామగ్రితోపాటు రూ.39వేల నగదు లభ్యమైంది.

మిజోరాం సోదాల్లో భారీగా ఆయుధాలు గుర్తించిన బీఎస్​ఎఫ్​

ABOUT THE AUTHOR

...view details