టీఆర్‌పీల విషయంలో కొన్ని ఛానళ్లు చేసిన మోసాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఈ మధ్య కాలంలో ఈ కుంభకోణాలపై పెద్ద ఎత్తున చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో వార్తా సంస్థల రేటింగ్‌లు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ అయిన బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) వెల్లడించింది. ఈ నిర్ణయం హిందీ, ప్రాంతీయ, ఆంగ్ల, బిజినెస్ న్యూస్ ఛానళ్లపై ప్రభావం చూపనుంది.
రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడానికి ప్రస్తుత ప్రమాణాలను సమీక్షించి, వాటిలో మార్పులు చేర్పులు చేయాలని బార్క్ భావిస్తోంది. ఈ క్రమంలో వీక్లీ రేటింగ్‌ల లెక్కింపును 12 వారాల వరకు నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
ఫేక్ రేటింగ్ పాయింట్స్‌పై బార్క్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు ఛానెళ్లపై దృష్టి పెట్టగా.. ఇటీవల మోసాలు వెలుగు చూసినట్లు ముంబయి పోలీసులు తెలిపారు.
ఎన్బీఏ ప్రశంసలు