సూరత్‌కు చెందిన కొందరు దేశభక్తులు.. చైనా వస్తువులను వాడొద్దంటూ నిరసనలు చేశారు. తాము ఇంట్లో వాడుతున్న టీవీ చైనాలో తయారైందేనని తెలిసి.. దానిని ముక్కలు ముక్కలు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయిన ఈ వీడియోపై ట్విట్టర్లో హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు నెటిజన్లు.
నెటిజన్ల స్పందనలు కొన్ని....
- "ఇకపై వచ్చే చైనా ఉత్పత్తులను బహిష్కరించాలి... కానీ మనం డబ్బులు వెచ్చించి కొనుక్కున్న వస్తువులను పగలగొట్టుకుంటే చైనాకు పోయేదేంటి? ఆ వస్తువుకు చైనాకు మనం ఇదివరకే డబ్బు చెల్లించేశాం కదా? ఇది మనకు నష్టం కానీ, చైనాకు కాదు."
-@రాబిన్‌హుడ్ పాండే
- "ఆహా .. చైనా టీవీని పగలగొట్టారు. కానీ, చైనా వీడియో ఎడిటింగ్ యాప్ పవర్ డైరక్టర్లో ఈ వీడియోను భలే ఎడిట్ చేశారు."
-ఇవాన్ మెహతా@ఇండియన్ ఐడిల్
- "అబ్బో.. టీవీలు పగులగొట్టి మనం చైనా ఆర్థిక వ్యవస్థను కూల్చేశామే...! "
-@దిల్_వాలా_
- "వస్తువులు బద్దలగొట్టేశాం. ఇంకేంటి.. మనమే గెలిచేశాం."