తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోడిపిల్ల బుజ్జిగాడికి... బుల్లి బహుమతి

మిజోరం బాలుడు డెరెక్ సీ లాల్​చాన్హిమా..తను చదువుకునే పాఠశాల నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. మిజో సంప్రదాయమైన శాలువాతో కప్పి సత్కరించింది పాఠశాల యాజమాన్యం. అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించే వారిని ఇలా గౌరవిస్తారు.

మిజోరాం పిల్లాడు

By

Published : Apr 5, 2019, 4:20 PM IST

మిజోరం సైరాంగ్​కి చెందిన బాలుడు డెరెక్ సీ లాల్​చాన్హిమా గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఆ పిల్లాడికి గుర్తింపు లభించింది. తను చదివే పాఠశాల నుంచి ప్రశంసా పత్రం లభించింది. అసాధారణ సాహసం చేసే వారికిచ్చే మిజో సంప్రదాయమైన శాలువాతో కప్పి సత్కరించింది పాఠశాల యాజమాన్యం.సైకిల్​ కింద పడిన కోడిపిల్లను బతికించడం కోసం పిల్లాడు చూపిన జాలికి సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.

మిజోరాం పిల్లాడు

సైకిల్​పై వెళ్తుండగా ఓ చిన్న కోడిపిల్ల అడ్డువచ్చింది. పొరపాటున సైకిల్ కింద పడింది. వెంటనే ఆ కోడిపిల్లను తీసుకుని సమీపంలోని ఆసుపత్రికెళ్లాడు బాలుడు. ఎలాగైనా కాపాడండి అంటూ జేబులోని డబ్బు తీసి వైద్యుడికివ్వబోయాడు. ప్రస్తుతం ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఇదీ చూడండి:'డాక్టర్​... ఈ కోడిపిల్లకు హెల్ప్ చేయండి'

ABOUT THE AUTHOR

...view details