తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎన్నికల ప్రచారంలో 'ఆగ్రా' తారలు - ఎన్నికలు 2019

ఉత్తరప్రదేశ్​లోని ఆగ్రా వీధుల్లో బాలీవుడ్ తారలు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్​ముఖ్​ ప్రత్యక్షమయ్యారు. స్థానికులంతా ఆశ్చర్యంతో వారి చుట్టూ చేరారు. అంతలోనే అసలు విషయం తెలిసింది.

ప్రచారంలో బాలీవుడ్ నటులను పోలిన వ్యక్తులు

By

Published : Apr 3, 2019, 5:40 PM IST

ప్రచారంలో బాలీవుడ్ నటులను పోలిన వ్యక్తులు
లోక్​సభ ఎన్నికల్లో వివిధ ప్రచార వ్యూహాలతో ముందుకెళుతున్నాయి పార్టీలు. అభిమానుల ఓట్లు కొల్లగొట్టేందుకు సినీతారలతో ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఉత్తపప్రదేశ్ ఆగ్రాలో మాత్రం వినూత్నంగా ఆలోచించారు అక్కడి ఎస్పీ-బీఎస్పీ కూటమి అభ్యర్థి మనోజ్ సోని. బాలీవుడ్ తారలను పోలిన వ్యక్తులను రంగంలోకి దించారు.

సోనిని గెలిపించాలని ఆగ్రా వీధుల్లో ప్రచారం నిర్వహించారు ఎస్పీ సీనియర్ నేత అక్బర్ ఖురేషి. ఆయనతో పాటు నటులు సైఫ్ అలీఖాన్, రితేశ్ దేశ్​ముఖ్​ను పోలిన యూనస్ సయ్యద్, దీపక్ కుమార్ పాల్గొన్నారు. అసలైన నటుల్లా మిమిక్రీ చేస్తూ ప్రజలను అలరించారు. ఆగ్రా ఎంపీగా సోనిని గెలిపించాలని అభ్యర్థించారు.

"అక్బర్​, మనోజ్ సోనికు మద్దతిచ్చేందుకు వచ్చాం. మహాకూటమి ప్రభుత్వంతో పరిస్థితులు మారతాయి. మీరూ ఆలోచించండి. ఇక్కడి ప్రజలను కోరుతున్నా ఏనుగు గుర్తుకు ఓటెయ్యండి. జీవితంలో మార్పు తప్పనిసరి. ఐదేళ్లుగా ప్రజలు బాధలు పడుతున్నారు. అది వాళ్లకూ తెలుసు. నేను చెప్పాల్సిన పనిలేదు."
-యూనస్ సయ్యద్, సైఫ్ అలీఖాన్​ను పోలిన వ్యక్తి

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details