తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చిన్న అక్షర దోషం- కుటుంబం మొత్తానికి కరోనా కష్టం - corona positive

కరోనా పరీక్షల కేంద్రంలోని సిబ్బంది చేసిన చిన్న తప్పిదం... ఓ కుటుంబం మొత్తాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఇంతకీ ఆ తప్పేంటి?

Blunder! Typo error turns man into corona positive
నిర్వాహకుల తప్పిదం.. నెగిటివ్​ను పాజిటివ్​ చేసేశారు!

By

Published : Apr 16, 2020, 1:03 PM IST

కరోనా లక్షణాలు ఏవి కనిపించినా తెగ కంగారు పడుతూ ఆస్పత్రుల చుట్టూ పరుగులు పెడుతున్నారు ప్రజలు. ఇలాగే యూపీలో ఓ వ్యక్తి ఆస్పత్రికి చేరుకోగా అతనికి కరోనా పరీక్షలు జరిపి పాజిటివ్​గా ప్రకటించారు అక్కడి వైద్యులు. తర్వాత నిజం తెలిసి కంగుతిన్నారు.

ఏం జరిగింది?

ఉత్తర ప్రదేశ్​లోని అమ్రోహా జిల్లా నౌగన్వా సాదత్​ పట్టణానికి చెందిన 66 ఏళ్ల వ్యక్తి జలుబు, గొంతు నొప్పితో బాధపడుతూ మొరాదాబాద్​ ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు రక్త నమూనాలు సేకరించి కరోనా పరీక్షల కోసం అలీగఢ్​ పంపారు. రిపోర్టుల్లో పాజిటివ్ అని వచ్చింది. వెంటనే మొరాదాబాద్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వృద్ధుడి కుటుంబసభ్యులును నిర్బంధించారు. ఆయనతో ఎవరెవరు సన్నిహితంగా మెలిగారో తెలుసుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

పొరపాటు అక్కడే...

ఈ తతంగం అంతా జరుగుతుండగా అసలు విషయం తెలిసింది. ఆ పెద్దాయనకు కరోనా సోకలేదని తేలింది. అలీగఢ్​ పరీక్షా కేంద్రంలోని సిబ్బంది పొరపాటున నెగిటివ్​గా బదులు పాజిటివ్​ అని నివేదికలో రాశారని ఆలస్యంగా గుర్తించారు అధికారులు. కరోనా సోకిందని హడలిపోయిన వృద్ధుడి కుటుంబసభ్యులు... అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.

ఇదీ చదవండి:24 గంటల్లో 721 కొత్త​ కేసులు- 37 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details