తెలంగాణ

telangana

ETV Bharat / bharat

క్యాన్సర్​పై పోరాడే నీలి బంగాళదుంప!

'కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ' (సీపీఆర్​ఐ) పదేళ్ల పాటు శ్రమించి సరికొత్త బంగాళదుంప విత్తనాన్ని కనుగొంది. నీలిరంగులో ఉండే ఈ ఆలుగడ్డకు క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం చేయగల శక్తి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రైతులు సాగు చేసుకునేందుకు వీటిని అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

By

Published : Apr 3, 2019, 8:32 AM IST

క్యాన్సర్​పై పోరాడే నీలి బంగాళాదుంప!

క్యాన్సర్​పై పోరాడే నీలి బంగాళదుంప!
బంగాళదుంప ప్రతి ఇంట్లో సాధారణ వంటకం. అందరూ ఇష్టపడే ఆలుగడ్డ క్యాన్సర్​ వంటి ప్రమాదకర రోగాలపై పోరాటం చేస్తే అద్భుతమే. సాధారణ ఆలుతో ఇది సాధ్యం కాదు కానీ శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఓ కొత్తరకం ఆలూతో ఇది సాధ్యమే.

హిమాచల్​ప్రదేశ్​ మోదీపురంలోని 'కేంద్ర బంగాళదుంప పరిశోధన సంస్థ' (సీపీఆర్ఐ)లో పదేళ్ల నుంచి పరిశోధనలు జరిపి ఒక కొత్తరకం విత్తనాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. పూర్తిగా నీలి రంగులో ఉండే ఈ ప్రత్యేక బంగాళదుంపకు 'కుఫరీ నీలంకంఠ'గా నామకరణం చేశారు శాస్త్రజ్ఞులు. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ విత్తనాలను సాధ్యమైనంత త్వరగా రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

"8 నుంచి 10 సంవత్సరాలు పరిశోధనలు జరిపి ఈ కొత్త రకం బంగాళదుంప విత్తనాన్ని కనుగొన్నాం. శరీరంలోని క్యాన్సర్ కారకంపై ఇది పోరాడగలదు. ప్రస్తుతం దీన్ని పరీక్షిస్తున్నాం. మరో నాలుగైదు ఏళ్లలో రైతులు సాగు చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకువస్తాం."
-సీపీఆర్ఐ పరిశోధకులు

ఇదీ చూడండి:చెర్రీ పూల సొగసు చూడతరమా?

ABOUT THE AUTHOR

...view details