తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నల్ల బియ్యంతో చందౌలీ రైతులకు లాభాల పంట - పూర్వాంచల్​

ఉత్తర్​ప్రదేశ్​ పూర్వాంచల్​ ప్రాంతంలోని చందౌలీలో రైతులు నల్ల బియ్యం పండించి లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ, నీతి ఆయోగ్​ చొరవతోనే ఇది సాధ్యమైంది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే నల్ల బియ్యం సాగు గురించి తెలుసుకోండి మరి..

Black rice: Getting popular among farmers, consumers
నల్లబియ్యానికి పెరిగిన డిమాండ్​

By

Published : Dec 17, 2020, 12:42 PM IST

చందౌలీ.. ఉత్తర్​ప్రదేశ్​ పూర్వాంచల్​ ప్రాంతంలోని ఓ జిల్లా. వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇప్పుడీ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. కారణం.. నల్ల వరి సాగు చేయడం. అవును.. నల్ల బియ్యం పండిస్తూ అక్కడి రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు మరి. వందలాది మంది ఈ పంట సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు.

నల్ల బియ్యం

ప్రధాని, కేంద్ర మంత్రి చొరవతో..

పాశ్చాత్య దేశాల్లో నల్ల బియ్యానికి బాగా డిమాండ్​ ఉంది. భారత్​లోనూ ఈ పంట సాగుకు అనువైన పరిస్థితులు ఉన్న ప్రాంతాలను గుర్తించాలని తొలిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ.. అధికారులను ఆదేశించారు. రైతుల ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా.. తొలుత ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని సూచించారు.

బ్లాక్​ రైస్​

అభివృద్ధి చెందని జిల్లాల్లో ఒకటిగా నీతి ఆయోగ్​ పేర్కొన్న చందౌలీ ప్రాంతాన్ని ఎంపిక చేశారు అప్పటి కేంద్ర మంత్రి మేనకా గాంధీ.

నల్ల వరి సాగు చేసేందుకు ఇక్కడి నేల అనువైనదిగా నీతి ఆయోగ్​ సమావేశంలో చర్చించిన తర్వాత.. ఆ దిశగా రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ప్రభుత్వ అధికారుల అనుమతి లభించింది.

బ్లాక్​ రైస్​

మణిపుర్​ నుంచి విత్తనాలు..

2018లో మణిపుర్​ నుంచి నల్ల వరి విత్తనాలను (చఖావ్​) చందౌలీ జిల్లా రైతులకు అందించారు. జిల్లా యంత్రాంగం తొలుత 10 మంది రైతులను ఎంపిక చేసింది. ఒక్కొక్కరికీ 10 కేజీల చొప్పున విత్తనాలు అందించింది. వారి ప్రయత్నాలు ఫలించాయి.

బ్లాక్​ రైస్​

ఆ రైతులు ఉత్పత్తి చేసిన పంట.. అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం(ఐఆర్​ఆర్​సీ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంది. నల్ల బియ్యం నాణ్యతను పరిశీలించేందుకు ఐఆర్​ఆర్​సీ బృందం జిల్లాలో పర్యటించి స్వయంగా ధ్రువీకరించింది. ఇంకా హెక్టారుకు సగటున 34 క్వింటాళ్ల దిగుబడి వచ్చినట్లు గుర్తించారు. తద్వారా.. మంచి దిగుబడితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే నల్ల బియ్యంపై ఇతర రైతులకు ఆసక్తి కలిగింది.

పంట కోస్తున్న రైతులు
నల్ల బియ్యాన్ని చూపిస్తున్న రైతు

ఆ పంట నుంచి సేకరించిన విత్తనాలతో తర్వాతి ఏడాది ఖరీఫ్​ సీజన్​లో 250 మందికి పైగా రైతులు సాగు చేశారు. పంట నిల్వకు, విక్రయాలకూ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టింది. మంచి ధర వస్తుందని ప్రజల్లో నమ్మకం కలిగించింది. నల్ల బియ్యం సాగుతో ఇప్పుడు చందౌలీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.

సిరులు పండించే నల్ల బియ్యం

లక్ష్యం విజయవంతం..

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ఈ పథకం విజయవంతమైంది. ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా సహా ఇతర ప్రపంచ దేశాలు ఇప్పుడు భారత్​ నుంచి నల్లబియ్యాన్ని దిగుమతి చేసుకోవాలని చూస్తున్నాయి.

నల్ల వరి సాగు చేసిన రైతు

ఈ కొత్త పంట గురించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు. నూతన వ్యవసాయ చట్టాల కారణంగా రైతులకు ప్రయోజనాలు కలుగుతాయని దీని ద్వారా నిరూపితమైనట్లు పేర్కొన్నారు.

ఇప్పుడు ఈ పంటను రాష్ట్రంలోని ఇతర జిల్లాలకూ విస్తరించాలని అధికారులు చూస్తున్నారు. ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నారు. రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, కొత్త రకాలైన ఇతర పంటలను పరిచయం చేయాలని ప్రయత్నిస్తున్నారు.

ఎన్నో లాభాలు..

యాంటీఆక్సిడెంట్లు, ఐరన్​, విటమిన్​- ఈ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. ఇంకా ఈ బియ్యం బయటి పొరలో ఆంథోసియనిన్స్​ అత్యధిక స్థాయిల్లో ఉంటాయి. ఇవి డయాబెటిస్, క్యాన్సర్ నివారణలో ఉపయోగపడతాయి.

ABOUT THE AUTHOR

...view details