మహారాష్ట్రలోని జల్గావ్లో భారతీయ జనతా పార్టీ సమావేశంలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ పార్టీకి చెందిన రెండు వర్గాల కార్యకర్తల గొడవే ఇందుకు కారణం.
మంత్రి సమక్షంలో కార్యకర్తల ఘర్షణ..! - భాజపా
సార్వత్రిక ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న తరుణంలో మహారాష్ట్రాలో భాజపాకు చెందిన రెండు వర్గాల కార్యకర్తలు గొడవపడ్డారు. రాష్ట్ర మంత్రి సమక్షంలోనే కార్యకర్తలు బూట్లతో దాడికి పాల్పడ్డ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
మంత్రి సమక్షంలో కార్యకర్తల ఘర్షణ..వీడియో వైరల్
రాష్ట్ర నీటి వనరుల శాఖ మంత్రి గిరీష్ మహాజన్ సభలో ఈ ఘటన చోటుచేసుకుంది. సభా వేదికపై మంత్రి ఉండగానే కార్యకర్తలు దాడికి దిగారు. అందులో ఓ కార్యకర్త తన కాలి బూటును తీసి మరోవర్గంపై దాడి చేయటం ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే స్పందించిన పోలీసులు వేదికపై నుంచి గొడవపడే వారిని కిందికి తోసివేసి పరిస్థితిని అదుపు చేశారు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఇదీ చూడండి: ప్రపంచంలోని 15 కాలుష్య నగరాల్లో 14 మనవే