మహారాష్ట్ర మాజీ సీఎం, భాజాపా సీనియర్ నేత దేవేంద్ర ఫడణవీస్ బిహార్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు భాజాపా కూటమి ఎన్నికల వ్యూహాల్లో ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. బిహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, కూటమి ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఫడణవీస్‌ను నియమించే అవకాశముందని .. భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఫడణవీస్ బిహార్ కోర్ కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఎన్నికల్లో ఫడణవీస్ పాత్రపై త్వరలోనే భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
బిహార్ ఎన్నికల్లో ఫడణవీస్ కీలక పాత్ర
త్వరలో జరగనున్న బిహార్ ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్. ఇప్పటికే ఆయన ప్రధాన పాత్ర పోషించనున్నట్లు భాజపా వర్గాలు ప్రకటించాయి.
బిహార్ ఎన్నికల్లో కీలక వ్యక్తిగా ఫడణవీస్
భాజపా కూటమిలోని లోక్ జనశక్తి, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారానికి ఫడణవిస్ కృషి చేయనున్నట్లు తెలుస్తోంది
ఇదీ చూడండి:తమిళనాట మరో 5,890 మందికి కరోనా
Last Updated : Aug 14, 2020, 9:56 PM IST