తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అబద్ధాలు చెప్పడంలో రాహుల్​ దిట్ట: భాజపా - The BJP on Thursday hit back at Congress leader Rahul Gandhi for his liar jibe at the prime minister, dubbing him as "joothon ka sardar"

కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని అసత్యవాదిగా పేర్కొనడంపై భాజపా ఆగ్రహించింది. అబద్ధాలు చెప్పడంలో రాహుల్​ దిట్ట అని వ్యాఖ్యనించింది.

rahul-bjp
అబద్ధాలు చెప్పడంలో రాహుల్​ దిట్ట: భాజపా

By

Published : Dec 26, 2019, 5:20 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అసత్యవాదిగా అభివర్ణించిన కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీపై భాజపా మండిపడింది. అబద్ధాలు చెప్పడంలో రాహుల్​ దిట్ట అని విమర్శించారు భాజపా ప్రతినిధి సంబిత్​ పాత్రా. మోదీపై రాహుల్​ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్నారు.

తొలుత భారత్​లో నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతమాతతో ఆర్​ఎస్​ఎస్​ ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. అసోంలో నిర్మితమవుతోన్న ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్​లో పంచుకున్నారు.

దీనిపై స్పందించిన సంబిత్​ పాత్రా.. 2011లో యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే అసోంలో నిర్బంధ కేంద్రాలు ఏర్పాటు చేసిన్నట్లు తెలిపారు.

"రాహుల్​ గాంధీ అబద్ధాలు చెప్పడంలో దిట్ట. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడే అసోంలో మూడు నిర్బంధ కేంద్రాలను ఏర్పాటు చేసింది."

-సంబిత్​ పాత్రా.

నిర్బంధ కేంద్రాలు, జాతీయ పౌర పట్టిక మధ్య ఎటువంటి సంబంధం లేదని వెల్లడించారు.

ఇదీ చూడండి : 'జాతీయ జనాభా పట్టిక-2020 ప్రమాదకారి'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details