తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' పీఠం: స్వతంత్రుల మద్దతు వేటలో భాజపా-సేన - shivsena latest news

మరాఠా రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అధికార పగ్గాలు చేపట్టే అంశంలో శివసేన, భాజపాల మధ్య నడుస్తున్న ప్రతిష్టంభన నూతన వ్యూహాలకు దారితీస్తోంది. బేరసారాలలో తమవాదనను నెగ్గేలా చేసుకునేందుకు ఇరు పార్టీలు.. స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేపనిలో నిమగ్నమయ్యాయి.

'మహా' పీఠం: స్వతంత్రుల మద్దతు వేటలో భాజపా-సేన

By

Published : Oct 28, 2019, 5:10 AM IST

Updated : Oct 28, 2019, 11:54 AM IST

మహారాష్ట్ర సీఎం పదవి సహా.. అధికారాన్ని సగం సగం పంచుకునే విషయంలో శివసేన, భాజపా మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ఆసక్తికరంగా సాగుతోంది. భేటీలో తమ వాదన నెగ్గేలా చేసుకునేందుకు ఇరుపార్టీలు సంఖ్యాబలం పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ముగ్గురు స్వతంత్రులు సహా ఇద్దరు చిన్న పార్టీలకు చెందిన శాసనసభ్యులు భాజపా-శివసేన కూటమికి మద్దతు ప్రకటించారు.

భాజపాకు రెబల్స్ మద్దతు

స్వతంత్ర ఎమ్మెల్యేలు గీతాజైన్, రాజేంద్ర రౌత్, రవి రానా భాజపాకు జైకొట్టారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​తో చర్చలు జరిపిన అనంతరం గీతాజైన్, రాజేంద్ర రౌత్ భాజపాకు మద్దతు ప్రకటించగా..రవిరానా మద్దతు తెలుపుతూ లేఖ రాశారు. ఈ ముగ్గురు భాజపా రెబల్ అభ్యర్థులుగా పోటీచేసి విజయం సాధించారు.

అటు ప్రహార్ జనశక్తి పార్టీకి చెందిన అచలాపుర్ ఎమ్మెల్యే బచ్​చౌ కదూ, రాజ్​కుమార్ పటేల్​ శివసేనకు మద్దతు ప్రకటించారు.

పీఠం సగం సగానికి అంగీకరించకపోవచ్చు..

భాజపా ప్రభుత్వం ఏర్పాటుకు శివసేన మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధినేత రామ్​దాస్ అథవాలే సూచించారు. చెరి రెండున్నరేళ్లు పాలించాలనే ఫార్ములాను భాజపా అంగీకరించకపోవచ్చన్న ఆయన...ఫడణవీస్​ను సీఎంగా కొనసాగించాలన్నారు. ఆదిత్య ఠాక్రేను డిప్యూటీ సీఎం చేసేందుకు శివసేన అంగీకరించాలని అథవాలే సలహా ఇచ్చారు.

30న షా-ఠాక్రే భేటీ!

కేంద్ర హోంమంత్రి, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్​షా... ఈ నెల 30న శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీకానున్నట్లు సమాచారం. భాజపాశాసనసభా

పక్షనేతను ఎన్నుకునే కార్యక్రమానికి హాజరుకానున్న షా... అనంతరం ఉద్ధవ్ ఠాక్రేతో సమావేశమవుతారని భాజపా వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత పరిస్థితుల్లో షా- ఠాక్రే భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'మహా' పాలనపై శివసేన అధినేతతో అమిత్​షా భేటీ!

Last Updated : Oct 28, 2019, 11:54 AM IST

ABOUT THE AUTHOR

...view details